Baby Movie Success Celebrations: కంటెంట్ తో కలెక్షన్స్ ఎలా కొల్లగొట్టాలో చేసి చూపించింది 'బేబీ' సినిమా. పట్టుమని పది కోట్లు బడ్జెట్‌ కూడా లేని ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఏకంగా రూ.90 కోట్లను రాబట్టింది. పెద్ద పెద్ద స్టార్లు లేరు, డైరెక్టర్ కూడా కొత్తవాడే, పెద్ద ప్రొడక్షన్ అంటే అది కాదు...కేవలం కథను నమ్ముకుని తీసిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. నిర్మాతకు ఊహించని రేంజ్ లో లాభాలు వచ్చాయి.  బేబీ సంచలన విజయం సాధించడంతో ఎస్కేఎన్.. దర్శకుడు రాజేష్‌కు కాస్ట్‌లీ కారును గిఫ్టుగా ఇచ్చాడు. బ్రాండ్ న్యూ మోడల్ బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఈ కారు ధర కోటికి పైనే ఉంటుందని టాక్. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే బేబీ రిలీజ్ కు ముందు కూడా సాయి రాజేష్ కు 25 లక్షల విలువ చేసే MG కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు SKN. ఇలా ఒక డైరెక్టర్ కు రెండు సార్లు కారు గిఫ్ట్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం బేబీ. సాయి రాజేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను SKN నిర్మించారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇందులో ఆనంద్, వైష్ణవి నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా వైష్ణవి అయితే తన పాత్రలో జీవించేసింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడు నటనకు ఫిదా అయ్యారు. యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా తెరకెక్కించడంతో చాలా రోజుల తర్వాత థియేటర్లన్నీ హౌస్ పుల్ బోర్డులతో కళకళ్లాడాయి. డిస్ట్రిబ్యూటర్‌లకు ఈ సినిమా భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఓటీటీలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 



Also Read: Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘'కన్నప్ప'’లో మలయాళ సూపర్ స్టార్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook