Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘'కన్నప్ప'’లో మలయాళ సూపర్ స్టార్

Manchu Vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరిగింది. తాజాగా ఈ ప్రాజెక్టులోకి మరో స్టార్ హీరో చేరాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2023, 03:35 PM IST
Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘'కన్నప్ప'’లో మలయాళ సూపర్ స్టార్

Kannappa Movie Update: డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా గురించి వస్తోన్న అప్డేట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రోజురోజుకూ కన్నప్ప మీద భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. మంచు విష్ణు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్పను రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ఈ ప్రాజెక్టులో ప్రభాస్, నయనతార కూడా భాగమయ్యారు. ఈ మూవీ నుంచి ఇటీవల హీరో నుపుర్ సనన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ ప్రాజెక్టులోకి మరో స్టార్ హీరో కూడా చేరాడు. మాలీవుడ్ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సైతం కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారట. ఈ మేరకు మంచు విష్ణు, మోహన్ లాల్‌ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కన్నప్ప టీం న్యూజిలాండ్‌లో ఉంది. శ్రీ  పరుచూరి గోపాలకృష్ణ గారు, శ్రీ  విజయేంద్ర ప్రసాద్ గారు, శ్రీ  తోటపల్లి సాయి నాథ్ గారు, శ్రీ  తోట ప్రసాద్ గారు, శ్రీ  నాగేశ్వర రెడ్డి గారు, శ్రీ ఈశ్వర్ రెడ్డి గారు ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు. మున్ముందు మరిన్ని అప్డేట్లతో కన్నప్ప మీద అంచనాలు పెంచబోతున్నారు.

Also Read: Miss Shetty Mr Polishetty: ఇట్స్‌ అఫీషియల్‌.. ఓటీటీలోకి 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'.. స్ట్రీమింగ్‌ డేట్ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News