Baby - Valentines Day Re Release: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. సాయి రాజేశ్ డైరెక్ట్ చేఆరు. బేబి చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాదు గతేడాది విడుదలైన చిత్రాల్లో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. కేవలం రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 50 కోట్లకు షేర్ (రూ. 100 కోట్ల గ్రాస్) రాబట్టి ఔరా అనిపించింది. అంతేకాదు నిర్మాతలకు దాదాపు రూ. 40 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన "బేబి" సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న థియేటర్స్ లోకి రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ఈ సినిమాలో పోటాపోటీగా నటించారు. డైరెక్టర్ సాయి రాజేశ్ ఈ సినిమాను ఇప్పటి మైండ్ సెట్ ఎలా ఉందో చూపించాడు. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.


చాలా రోజుల తర్వాత రియలిస్టిక్ ప్రేమకథతో 'బేబి' సినిమా తెరకెక్కింది. అంతేకాదు తెలుగులో సూపర్ హిట్టైన ఈ చిత్రాన్ని ఇపుడు వివిధ భాషల్లో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా థియేటర్స్‌లో పాటు ఓటీటీతో పాటు టీవీల్లో కూడా ఇరగదీసింది. కల్ట్ బొమ్మగా 'బేబి' మూవీ పేరు తెచ్చుకుంది. మరి ఇంత మంచి సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. మరి వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు


Also Read: TN Assembly: తమిళనాడులో 'జనగణమన' రచ్చ.. అసెంబ్లీని బహిష్కరించిన గవర్నర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook