Family Star Collections :


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక నిర్మాతగా, ఒక డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకి తెలుగు ఇండస్ట్రీ లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. రెండు దశాబ్దాలకు పైగా దిల్ రాజు ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూనే ఉన్నారు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చే ఏ సినిమా అయినా గొప్పగానే ఉంటుంది కానీ ఫ్యాన్స్ కూడా నమ్ముతారు. 


దిల్ రాజు జడ్జిమెంట్ అంత కరెక్ట్ గా ఉంటుంది అని ఫ్యాన్స్ నమ్మకం. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే దిల్ రాజు నిర్మించిన లేదా డిస్ట్రిబ్యూట్ చేసిన చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈమధ్య దిల్ రాజు సినిమాలు అంతగా ఆడటం లేదు. 


వరుసగా దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. అంతకు ముందు దిల్ రాజు సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లు కాకపోయినాప్పటికీ ఒక సినిమా ఫట్ అయితే వెంటనే మరొక సినిమా హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు వరుసగా దిల్ రాజుకి ఎదురు దెబ్బలు మాత్రమే తగులుతున్నాయి. 


గతేడాది విజయ్ హీరోగా నటించిన వారసుడు అనే తమిళ్ సినిమా తో దిల్ రాజు డిజాస్టర్ అందుకున్నారు. అంతకన్నా ముందు థాంక్యూ సినిమా తో మరొక డిజాస్టర్ దిల్ రాజుకి ఎదురయింది. ఎఫ్ త్రీ, వకీల్ సాబ్ సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. 


ఒకవైపు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్, షాదీ ముబారక్, ఇద్దరి లోకం ఒకటే సినిమాలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇక లేటెస్ట్ గా దిల్ రాజు ప్రొడక్షన్ లో విడుదలైన ఫ్యామిలీ స్టార్ సినిమా లో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 5 న థియేటర్లలో విడుదలైంది.


కానీ ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. వారాంతం కూడా పూర్తి అవడంతో సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. సినిమాలు పోతూ ఉండటంతో బయర్లకి కూడా దిల్ రాజు సినిమాలపై నమ్మకం తగ్గిపోతూ వస్తుంది. మరి తన నెక్స్ట్ సినిమాలతో అయినా దిల్ రాజు హిట్ అందుకుంటారా లేదా చూడాలి.


Also Read: KCR Arrest: కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ఇదేనా?


Also Read: Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..


 



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook