Sathyaraj Hospitalised: కరోనాతో ఆసుపత్రిలో బాహుబలి కట్టప్ప.. సీరియస్ కండిషన్..
Actor Sathyaraj Hospitalised: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ సినీ తారలు కూడా వరుసగా కరోనా బారినపడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల్లో ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా బారినపడ్డారు. తాజాగా నటుడు సత్యరాజ్ కరోనాతో ఆసుపత్రిలో చేరారు.
Actor Sathyaraj Hospitalised: బాహుబలి కట్టప్ప, కోలివుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం చెన్నైలోని అమింజిక్కరైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే ఆయన్ను ఆసుపత్రికి తరలించారనే ప్రచారం జరుగుతోంది. గత వారం సత్యరాజ్‌కు స్వల్ప లక్షణాలు బయటపడటంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటినుంచి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. గత రాత్రి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. సత్యరాజ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రేక్షకులు, ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.
కోలీవుడ్‌లో (Kollywood) ఇప్పటికే వడివేలు, మీనా, త్రిష, అరుణ్ విజయ్, కమల్ హాసన్ తదితరులు కరోనా బారినపడ్డారు. కమల్ హాసన్, వడివేలు కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. అరుణ్ విజయ్, మీనా, త్రిష ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్నారు. ఇటు టాలీవుడ్‌లోనూ ఇటీవలి కాలంలో పలువురు నటీనటులు కరోనా బారినపడ్డారు. హీరో మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌లకు కరోనా సోకడంతో ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తమను కలిసినవారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఈ ఇద్దరు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
కాగా, కొద్ది రోజుల క్రితం వరకు 10వేల మార్క్‌కి కాస్త అటు ఇటుగా నమోదైన కరోనా కేసులు ఒక్కసారిగా లక్షకి పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో దాదాపు ఏడు నెలల తర్వాత శుక్రవారం (జనవరి 7) ఒక్కరోజే 1,17,000 కేసులు నమోదయ్యాయి. గతేడాది జూన్ 6 తర్వాత దేశంలో ఒక్కరోజులోనే లక్ష పైచిలుకు కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గతేడాది డిసెంబర్ నాటికి కరోనా కేసులు (Covid 19 cases in India) పూర్తిగా తగ్గుముఖం పట్టగా... కొద్ది రోజుల వ్యవధిలోనే కేసులు విపరీతంగా పెరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే వైరస్ కట్టడి చర్యలు మొదలుపెట్టాయి.
Also Read: Weekend Curfew: ఢిల్లీ, కర్ణాటకల్లో నేటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ.. అమలులోకి ఈ నిబంధనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook