Trisha tests positive for Covid : త్రిషకు కోవిడ్ పాజిటివ్.. వారం రోజులుగా నరకం.. అక్కడ ఇరుక్కపోయిన హీరోయిన్!

Actress Trisha tests positive for Covid : కోవిడ్ బారినపడిన సినీ నటి త్రిష.. వారం రోజులుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పిన త్రిష ప్రస్తుతం ఇండియాలో లేదు. అక్కడి నుంచి ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

Last Updated : Jan 8, 2022, 12:53 AM IST
  • కోవిడ్ బారిన సినీ నటి త్రిష
  • న్యూ ఇయర్‌‌కు ముందు పాజిటివ్
  • వారం రోజులు ఇబ్బందులు పడ్డ హీరోయిన్
  • ప్రస్తుతం లండన్‌లో ఉన్న త్రిష
Trisha tests positive for Covid : త్రిషకు కోవిడ్ పాజిటివ్.. వారం రోజులుగా నరకం.. అక్కడ ఇరుక్కపోయిన హీరోయిన్!

Actress Trisha tests positive for Covid she is recovering full details here : సినీ నటి త్రిష కోవిడ్ బారిన పడింది. తాను కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ న్యూ ఇయర్‌‌కు ముందు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని త్రిష పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం కరోనా లక్షణాలు ఉన్నాయనీ తెలిపారు. అయితే కోవిడ్‌ (Covid‌) ప్రభావం నుంచి తాను కోలుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు గత వారం రోజులుగా తాను చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నట్లు త్రిష (Trisha) పేర్కొన్నారు. 

వ్యాక్సిన్ (Vaccine) తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్టు చెప్పుకొచ్చారు త్రిష. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్‌ (Covid vaccine‌) వేయించుకోవాలని సూచించారు. అలాగే మాస్క్‌లు తప్పకుండా ఉపయోగించాలని కోరారు.

తాను మళ్లీ కోవిడ్ టెస్ట్ ( (Covid test) చేయించుకున్నానని త్రిష తెలిపింది. కోవిడ్ నెగెటివ్‌గా (Covid Negative‌) తేలితే వెంటనే ఇంటికి వెళ్లిపోతానని పేర్కొంది. కాగా త్రిష ప్రస్తుతం లండన్‌లో ఉంది. తాను కోవిడ్ నుంచి కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ త్రిష ట్వీట్ చేశారు. 

 

Also Read : Oo Antava Song: యూట్యూబ్​ను ఊపేస్తున్న ఊ అంటావా.. ఊఊ అంటావా మావా సాంగ్​!

అయితే దేశవ్యాప్తంగా చాలా మంది సినీ సెలబ్రిటీలు వరుసగా కోవిడ్ (Covid) బారినపడుతున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులకు కరోనా పాజిటివ్‌గా (Corona positive‌) తేలింది. తెలుగు ఇండస్ట్రీలో కూడా మహేశ్‌బాబు, మంచు లక్ష్మి, తమన్‌ (Thaman‌) తదితరులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

Also Read : Aisha Sharma Hot Pics: చలికాలంలోనూ అందాలతో సెగ పుట్టిచ్చేస్తుంది ఈ సుందరి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News