Balagam Collections: 20వ రోజు కూడా 1.76 కోట్లు వసూలు చేసిన బలగం.. ఇది కదా బలమంటే?
Balagam 20 Days Total Collections: బలగం సినిమా విడుదలై దాదాపు 20 రోజులు గడుస్తున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Balagam 20 Days Collections: ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా సుధాకర్ రెడ్డి కీలక పాత్రలో నటించిన చిత్రం బలగం. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరిట దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రారంభించిన కొత్త ప్రొడక్షన్ హౌస్ లో ఈ సినిమా రూపొందింది. సినిమా విడుదలై దాదాపు 20 రోజులు గడుస్తున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని అంటున్నారు.
ఈ సినిమా 20వ రోజు అంటే ఉగాది రోజున భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా మూడవరోజు కోటి 75 లక్షలు వసూలు చేయగా ఐదో రోజు కోటి 80 లక్షలు వసూలు చేసింది. తొమ్మిదో రోజు కోటి 77 లక్షల వసూలు చేయగా పదవరోజు రెండు కోట్ల 36 లక్షలు 17వ రోజు కోటి 82 లక్షల వసూలు చేయగా 20వ రోజు అంటే ఉగాది సందర్భంగా కోటి 76 లక్షల వసూలు చేసి హాట్ టాపిక్ గా మారింది. నిజానికి 22వ తేదీ ఉగాది సందర్భంగా రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
కృష్ణవంశీ డైరెక్షన్ లో రూపొందిన రంగ మార్తాండ సినిమాతో పాటు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన దాస్ కా ధమ్కీ సినిమా కూడా రిలీజ్ అయ్యాయి. అయితే కృష్ణవంశీ సినిమాకి కలెక్షన్స్ చెప్పుకోదగ్గ రేంజ్ లో రాలేదు. కానీ దాస్ కా ధమ్కీ సినిమాకు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఆ సినిమాతో పోటాపోటీగా బలగం సినిమా విడుదల 20 రోజులు గడుస్తున్నా మంచి వసూలు రాబట్టడం గమనార్హం.
ఇక 20 రోజులకు గాను వెండి తెలుగు రాష్ట్రాల్లో 21 లక్షల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా 9 కోట్ల 72 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక 20 రోజుల పాటు కర్ణాటక సహా మిగతా భారత దేశాలతో పాటు ఓవర్సీస్ లో 42 లక్షలు వసూలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒక్క కోట్ల 73 లక్షల గ్రాస్, 9 కోట్ల 92 లక్షల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా బిజినెస్ కోటి 15 లక్షలకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా కోటి 30 లక్షలు అని ఫిక్స్ చేశారు. ఇక ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా 8 కోట్ల 62 లక్షల వసూళ్లతో లాభాలతో దూసుకుపోతోంది.
Also Read: Ram Gopal Varma Complaint: యూనివర్సిటీ స్పీచ్ వివాదం..వాళ్లపై తిరిగి కేసు పెడతానంటున్న వర్మ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook