Unstoppable 2: అన్‌స్టాపబుల్ 2లో పవన్ కళ్యాణ్‌ను అడిగే ప్రశ్నలివేనా, సోషల్ మీడియాలో వైరల్
Unstoppable 2: ఆహాలో ప్రసారమౌతున్న అన్‌స్టాపబుల్ త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో జరగనుంది. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కానున్న అన్‌స్టాపబుల్ ఎన్‌బికే విత్ పవన్ కళ్యాణ్ షోకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్స్ వెలువడ్డాయి.
నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 2 ఆహాలో దూసుకుపోతోంది. ఈ షో ఆహాను రేటింగ్ పరంగా టాప్‌లో ఉంచుతోంది. అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌ను చంద్రబాబుతో ప్రారంభించిన బాలయ్య..ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో చివరి ఎపిసోడ్ తీయనున్నాడు.
త్వరలో అన్‌స్టాపబుల్ ఎన్‌బికే విత్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోప్రారంభమౌతుంది. సంక్రాంతి కానుకగా 2023 జనవరిలో స్ట్రీమింగ్ కావచ్చని సమాచారం. పవన్ కళ్యాణ్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపధ్యంలో బాలయ్య.. పవన్ కళ్యాణ్‌ను అడగబోతున్న ప్రశ్నలివేనంటూ సోషల్ మీడియాలో కొన్ని అంశాలు ప్రచారమౌతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
2014లో ఏ విధమైన పదవి ఆశించకుండా టీడీపీకు నిండు మనస్సుతో మద్దతు తెలిపినందుకు పవన్ కళ్యాణ్‌కు ముందుగా బాలయ్య కృతజ్ఞతలు చెప్పనున్నాడు. 2019 ఎన్నికల్లో ఓటమి, తరువాత ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడని మరో ప్రశ్న ఉంటుందట. షో మధ్యలో పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవితో వీడియో కాల్, కాస్సేపు మెగాస్టార్‌తో బాలయ్య చిట్‌చాట్ ఉంటుందని సమాచారం.
ఇక ఈ షోకు పవన్ కళ్యాణ్‌తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, డైరెక్టర్ క్రిష్ హాజరుకానున్నారు. హరిహర వీరమల్లు సినిమాపై కాస్సేపు చర్చ ఉంటుంది. చివరిగా టీడీపతో పొత్తు గురించి స్పష్టత వచ్చే ప్రశ్నలుండవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఏపీ మూడు రాజధానుల అంశంపై కచ్చితంగా 1-2 ప్రశ్నలుండవచ్చని తెలుస్తోంది. ఇటీవల విశాఖ నోవాటెల్ హోటల్ ఎపిసోడ్ గురించి కూడా అడిగే అవకాశాలున్నాయి.
Also read: Namrata-Mahesh Deal: పెళ్లికి ముందే ఆ డీల్ చేసుకున్న మహేశ్-నమ్రతా శిరోద్కర్, ఆ డీల్ ఏంటంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook