Balakrishna 109 Movie Update: నందమూరి బాలకృష్ణ మంచి జోష్లో ఉన్నారు. ఆయన ఏం చేసినా దాదాపుగా అవన్నీ సక్సెస్ అవుతూ వస్తున్నాయి. ముందుగా అన్ స్టాపబుల్ తర్వాత అఖండ, ఆ తర్వాత వీర సింహారెడ్డి సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న ఆయన ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే విడుదలైన ఒక మాసి ఫస్ట్ గ్లింప్స్ సినిమా మీద ఆసక్తి పెంచింది. ఇక ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయకపోయినా భగవత్ లాల్ కేసరి అనే టైటిల్ దాదాపుగా ఖరారు అయినట్టే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోపక్క నందమూరి బాలకృష్ణ తరువాత సినిమా మీద కూడా క్లారిటీ వచ్చేసింది. నిర్మాత నాగ వంశీ ఈ విషయం మీద క్లారిటీ చేశారు. తాజాగా ఆయన తన ట్విట్టర్లో ఒక ఆసక్తికరమైన ట్విట్ చేశారు. అది ఏంటంటే జూన్ 10వ తేదీ అంటూ డేట్ పోస్ట్ చేసి సింహం బొమ్మను పోస్ట్ చేశారు.


Also Read: Dil Raju: ఆదిపురుష్ నుంచి దూరం జరిగిన దిల్ రాజు.. అసలు ఏమైందంటే?


నిజానికి ఈ పదవ తేదీ జూన్ నెల నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలు గురించి తర్వాత చేయబోతున్న సినిమాల గురించి కొన్ని అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఆ రోజే నందమూరి బాలకృష్ణ 109వ సినిమాకి సంబంధించి ఒక అధికారిక ప్రకటన రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఆ రోజు సితార ఎంటర్టైన్మెంట్స్, నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లోని ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బాబీ సినిమా కనక ఖరారు అయితే నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. డైరెక్టర్ బాబి ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అనే సినిమా చేయగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వీర సింహారెడ్డితో కలిసి రిలీజ్ అయి మంచి వసూళ్లు రాబట్టింది.


Also Read: Shaitan Web Series: వణుకు పుట్టిస్తున్న సైతాన్ ట్రైలర్...ఛీ.. అవేం బూతులురా బాబూ! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి