Shaitan Web Series: వణుకు పుట్టిస్తున్న సైతాన్ ట్రైలర్...ఛీ.. అవేం బూతులురా బాబూ!

Shaitan Web Series Trailer 2023: తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసమే మరొక వెబ్ సిరీస్ కూడా సిద్ధం చేశారు. సైతాన్ అనే ఒక వెబ్ సిరీస్ లో సాయి కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ రోల్ లో నటించగా ఆ ట్రైలర్ రిలీజ్ అయింది.     

Written by - Chaganti Bhargav | Last Updated : Jun 5, 2023, 04:16 PM IST
Shaitan Web Series: వణుకు పుట్టిస్తున్న సైతాన్ ట్రైలర్...ఛీ.. అవేం బూతులురా బాబూ!

Shaitan Web Series 2023: ఒకప్పుడు వెబ్ సిరీస్లు హిందీలో రూపొందించబడి వాటిని తెలుగులో డబ్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు నేరుగా తెలుగులో వెబ్ కంటెంట్ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఈ మధ్యకాలంలో ఓటిటి కంటెంట్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ మహీ వి రాఘవ్ ముందుంటున్నారు.

ఇప్పటికే ఆయన సేవ్ ది టైగర్స్ అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ రూపొందించగా దానికి మంచి టాక్ వచ్చింది. ఇక తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసమే మరొక వెబ్ సిరీస్ కూడా ఆయన సిద్ధం చేశారు. సైతాన్ అనే ఒక వెబ్ సిరీస్ ని ఆయన సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో సాయి కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ రోల్ లో నటించగా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.

Also Read: Rakul Preet Singh: మాల్దీవుల్లో మంటలు రేపుతున్న రకుల్ ప్రీత్‌సింగ్.. హాట్ ట్రీట్ అంతకుమించి..! 

ఈ ట్రైలర్ అయితే చూసిన తర్వాత అందరూ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ట్రైలర్ మొత్తం బూతు డైలాగులతో పాటు హింసాత్మక సీన్లతోనే నిండిపోయింది. నిజానికి ఇప్పటివరకు పాఠశాల, యాత్ర వంటి సినిమాలు చేసి సేవ్ ది టైగర్స్ పేరుతో ప్యూర్ కామెడీ పండించిన మహి రాఘవ్ తన శైలికి పూర్తి భిన్నంగా పూర్తి స్థాయిలో రా అండ్ రస్టిక్ సైతాన్ సిరీస్ తెరకెక్కించినట్లు సిరీస్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News