Balakrishna Vs Jr NTR:  నందమూరి బాలకృష్ణ తాజాగా దుబాయి వేదికగా అబుదాబీలో నిర్వహిస్తోన్న ఐఫా అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి దుబాయి వెళ్లారు. రీసెంట్ గా బాలయ్య హీరోగా 50 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని సినీ పరిశ్రమ తరుపున ఘనంగా సన్మానించారు. సినీ రంగంలో నటుడిగా 50 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐఫా వారు ఆయన్ని గోల్డెన్ లెగసీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా బాలయ్య జీ తెలుగు ఛీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా తన సినీ ప్రస్థానంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  అంతేకాదు మోక్షజ్ఞ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ లో మోక్షజ్ఞ సినిమాకు స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన కథ ఎలా ఉండబోతుందో అనేదానికి ఎలా లీక్ చేస్తామంటూ బాలయ్య కాస్త గడుసు సమాధానమే ఇచ్చారు. మరోవైపు తెలుగులో సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలను చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.  అఖండతో తెలుగులో హిందుత్వ సినిమాలకు దిశా నిర్ధేశం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కరోనా సమయంలో అందరు భయపడుతున్న సమయంలో ఈ మూవీని విడుదల చేసి విజయం సాధించాము. మిగతా హీరో, దర్శకులు తమ సినిమాలను విడుదల చేసుకునేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.  ఇక జీ తెలుగు ఛీఫ్ ఎడిటర్ మీ వారసుడు ఎవరు అనే ప్రశ్నకు .. నా కుమారుడు మోక్షజ్ఞతో పాటు నా మనవళ్లు ఉంటారని చెప్పారు.


ఇక్కడ తన సొంత అన్నయ్య హరికృష్ణ కుమారులైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు అస్సలు ప్రస్తావించక పోవడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీ విడులైన మొదటి రోజే సంచలన వసూళ్లను సాధించింది. దాదాపు రూ. 172 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతుంది. ఎన్టీఆర్ .. నందమూరి మూడో తరంలో ప్యాన్ ఇండియా స్టార్ గా ఇంటర్నేషనల్ లెవల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ఇలాంటి సమయంలో బాలయ్య.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ తన వారసుడు కాదనే విషయాన్ని  ప్రస్తావించకపోవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.