Balakrishna Arrogant Behaviour: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను ఏమాత్రం పట్టించుకోని బాలకృష్ణ.. ఇంత పొగరా అంటూ?
BalaKrishna Arrogant Behaviour : నందమూరి తారకరత్న పెద్దకర్మలో నందమూరి కుటుంబ సభ్యులు ఇతర సినీ సెలబ్రిటీలు పాల్గొని తారకరత్నకి నివాళులర్పించారు, అయితే బాలకృష్ణ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం అయింది.
BalaKrishna Arrogant Behaviour With Jr NTR and Kalyan Ram: నందమూరి తారకరత్న కొన్నాళ్ల క్రితం కార్డియాక్ అరెస్ట్ కు గురై మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే. అతి చిన్న వయసులోనే ఆయన తన భార్య ముగ్గురు పిల్లలను వదిలేసి శివైక్యమయ్యారు. సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న శివరాత్రి రోజున విశ్వాస విడవడం అందరినీ కలచివేసింది. ఇక ఈరోజు తారకరత్న పెద్దకర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఇక ఈ పెద్దకర్మలో నందమూరి కుటుంబ సభ్యులు ఇతర సినీ సెలబ్రిటీలు పాల్గొని తారకరత్నకి నివాళులర్పించారు.
బాలకృష్ణ కుటుంబానికి పెద్దగా ఉండి ఈ పెద్దకర్మ కార్యక్రమం మొత్తాన్ని ముందుండి నడిపించారు. తారకరత్న హాస్పిటల్ పాలైనప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ ఆ కుటుంబానికి అన్ని తానే వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పెద్ద కర్మలో కూడా బాలయ్య తారకరత్న ఫ్యామిలీకి అండగా ఉంటూ తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డికి ధైర్యం చెబుతూ కనిపించారు. ఇక ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు జూనియర్ సహా అనేక సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు.
అయితే ఈ పెద్ద కర్మలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే మిగతా కుటుంబ సభ్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సైతం కూర్చుని ఉన్నారు. ఇంతలో బాలకృష్ణ ఉండడంతో వెంటనే నందమూరి సోదరులు ఇద్దరు ఆయనకి గౌరవం ఇస్తూ లేచి నిలబడ్డారు. నందమూరి బాలకృష్ణ కి ఇద్దరూ గౌరవం ఇస్తూ లేచి నిలబడడం ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ వారిని పట్టించుకోనట్లుగా వేరొకరిని పలకరించి వెనక్కి రావడం వీడియోలో రికార్డు అయింది.
ప్రస్తుతానికి ఈ చిన్న క్లిప్ ని పట్టుకుని అటు నందమూరి అభిమానులు మా హీరోలకు పెద్దవారు అంటే ఎంత గౌరవమో చూసారా అంటూ కామెంట్ చేస్తుంటే యాంటీ నందమూరి అభిమానులు మాత్రం బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అంటే ఎంత చులకన చూశారా కనీసం వాళ్ళు లేచి నుంచున్నారు కూర్చోమని చెప్పే ఉద్దేశం కూడా లేకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూశారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో పలు రకాల పేర్లతో ట్యాగ్స్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.
Also Read Taraka Ratna Dasha Dina Karma: తండ్రి చేతుల మీదుగా తారకరత్న పెద్ద కర్మ.. కుమార్తెకు చంద్రబాబు అభయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి