Taraka Ratna Last Love Letter: 'ప్రేమ తో మీ ఓబు'.. తారకరత్న చివరి ప్రేమలేఖ షేర్ చేసి కన్నీళ్లు పెట్టిస్తున్న అలేఖ్యా రెడ్డి!

Alekhya Reddy - Taraka Ratna Love Letter:నందమూరి తారకరత్న దశదినకర్మ రోజునే గతంలో ఆయన తనకు రాసిన ప్రేమ లేఖను అలేఖ్య రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 2, 2023, 06:09 PM IST
Taraka Ratna Last Love Letter: 'ప్రేమ తో మీ ఓబు'.. తారకరత్న చివరి ప్రేమలేఖ షేర్ చేసి కన్నీళ్లు పెట్టిస్తున్న అలేఖ్యా రెడ్డి!

Alekhya Reddy Shares Taraka Ratna Last Love Letter: నందమూరి తారకరత్న దశదినకర్మ రోజునే గతంలో ఆయన తనకు రాసిన ప్రేమ లేఖను అలేఖ్య రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.  ఇది ఎప్పుడు రాశారనే విషయం మీద క్లారిటీ లేదు కానీ తారక రత్న తనకు రాసిన చివరి లేఖను సోషల్ మీడియాలో అలేఖ్య రెడ్డి షేర్ చేయడంతో  తారకరత్న అభిమానులు అది చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక తారకరత్న అలేఖ్య రెడ్డికి రాసిన చివరి ప్రేమలేఖ ఇంగ్లీషులో రాయగ దాన్ని తెలుగులో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం యధాతధంగా ‘’హలో తల్లి, నేనేం చెప్పాలి ఎలా మొదలుపెట్టాలి సరే ముందుగా హ్యాపీ వాలెంటైన్స్ డే బంగారు తల్లి. నేను ఇలా లెటర్ రాస్తున్నానంటే నమ్మలేకపోతున్నాను ఎందుకంటే నీకు తెలుసు నేను ఏదైనా విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే చాలా పూర్. మరీ ముఖ్యంగా నా గురించి నేను ఎక్స్ ప్రెస్ చేసుకోవటంలో చాలా వెనుకబడి ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను చాలా చాలా ప్రేమిస్తున్నాను. ఈ విషయాన్ని నీకు చెప్పాలనుకున్నాను ఒక రకంగా చెప్పాలంటే నేను నిన్ను ప్రపంచంలో అన్నిటికన్నా, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నిజానికి నేను నన్ను ప్రేమించడం కంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. అలాగే కొన్నిసార్లు నీతో దురుసుగా ప్రవర్తించాను అది కూడా ప్రేమ కారణంగానే అలా చేసినందుకు నేను నిన్ను ద్వేషిస్తున్నాను అనుకోవద్దు. నిజానికి నన్ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ నువ్వు నన్ను వదులుకోకుండా అన్ని విషయాల్లోనూ నాతోనే ఉన్నందుకు నాతోనే ఉంటున్నందుకు చాలా థాంక్స్. నాకు నువ్వు కావాలి నన్ను ఇలా భరిస్తున్నందుకు నీకు ఎవరో ఒకరు ఆస్కార్ ఇవ్వాలి. నేను నిన్ను ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూనే ఉంటాను, నాకున్న ఏకైక ప్రేమ వి నువ్వే నా ప్రపంచం నువ్వే బంగారు, మరోసారి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు నా చివరి శ్వాస వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. లవ్ యు సో మచ్ బంగారు యువర్స్ ఓబూ’’ అంటూ కళ్యాణ్ రామ్ లేఖ్య రాశారు.

దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె ‘’మేము అన్ని ఒడిదుడుకులతో ఇంత దూరం పోరాడాము, జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము, కానీ మేము ఇంత దూరం వరకు వచ్చాం. నువ్వు, నేను మాత్రమే, మంచి టైం కోసం ఎదురు చూశాం, మ కోసం ఒక చిన్న చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాము.. అసలు మీ గురించి ఎవరికీ తెలియదు, మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, అలా మిమ్మల్ని నేను అర్ధం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను. బాధనంతా దాచుకున్నావు నువ్వు, మాకు అపారమైన ప్రేమను అందించావు..ఎన్ని పచ్చి అబద్ధాలు మా చుట్టూ ఉన్నా నేను నిలబడి ఉంటాను నానా అంటూ ఎమోషనల్ అయ్యారు. 
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede)

Also Read: Rajamouli Attack: ఆ వ్యక్తిని కొట్టించాలనుకున్న రాజమౌళి.. అసలు ఏమైందంటే?

Also Read: Taraka Ratna Dasha Dina Karma: తండ్రి చేతుల మీదుగా తారకరత్న పెద్ద కర్మ.. కుమార్తెకు చంద్రబాబు అభయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News