Bhagavanth Kesari collections : దూసుకుపోతున్న బాలకృష్ణ.. మూడు రోజుల్లో ఏకంగా 71 కోట్లు..
Bhagavanth Kesari collections: బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి సూపర్ హిట్ అందుకున్నాడు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. మూడు రోజుల్లో ఏకంగా ఈ సినిమా దాదాపు 71 కోట్లు వసూలు చేసి.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర బాలకృష్ణ పవర్ రుజువు చేసింది.
Bhagavanth Kesari : అఖండ, వీర సింహారెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మరోసారి బాలకృష్ణ ఇంకో బంపర్ హిట్ అందుకునేశాడు. ఈసారి ఎలాగైనా మా హీరో హ్యాట్రిక్ కొడతారని అనుకున్నా బాలయ్య అభిమానుల కోరికను తీర్చేశాడు. తన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరితో మరో సూపర్ హిట్ అందుకున్నారు నందమూరి హీరో.
ఈ దసరాకి తెలుగు ప్రేక్షకుల ముందుకి మూడు సినిమాలు వచ్చాయి. అందులో బాలకృష్ణ సినిమా అలానే విజయ్ లియో సినిమా అక్టోబర్ 19న విడుదల కాగా, ఒకరోజు ఆలస్యంగా అక్టోబర్ 20న రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలైంది.
కాగా ఇందులో విజయ్ లియో సినిమా కేవలం పరవాలేదనిపించుకోగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫైనల్ గా ఫ్లాప్ గానే మిగిలేటట్టు ఉంది. ఇక ఈ రెండు సినిమాలు కూడా మొదటి షో నుంచే పెద్దగా టాక్ సొంతం చేసుకోకపోవడంతో అందరి దృష్టి బాలకృష్ణ సినిమా పైనే పడింది. దానికి తగ్గట్టు మంచి ఎమోషన్స్ అలానే యాక్షన్ తో కూడిన భగవంట్ కేసరి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక దసరా పండుగకు ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఇలా అన్ని విధాల ఈ సినిమాకి కలిసి రావడంతో ఇప్పుడు ఏకంగా మూడు రోజుల్లోనే 71 కోట్ల కలెక్షన్స్ సాధించింది బాలయ్య చిత్రం.
భగవంత్ కేసరి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 58 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 72 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. కాగా మూడు రోజుల్లోనే ఈ చిత్రం డెబ్బై కోట్లు సంపాదించేసింది. తొలి రోజు 33 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది ఈ సినిమా. కానీ రెండో రోజు మాత్రం ఈ చిత్రం కలెక్షన్స్ కొంచెం తగ్గాయి. రెండు రోజుల్లో 51 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కాగా విడుదలైన రెండు సినిమాలు ఫ్లాప్ గా మిగలగా మూడో రోజు మాత్రం బాలకృష్ణ సినిమా మరోసారి హవా చూపించింది. ఇక మూడో రోజు భగవంత్ కేసరి ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షోకు 34 కోట్ల రూపాయలు, మ్యాట్నీకి 50 శాతం, ఫస్ట్ షోకు 57 శాతం, సెకండ్ షోకు 60 శాతం వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 71.02 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టేసింది. ఇదే విషయాన్ని ఈ సినిమా మేకర్స్ ఒక పోస్టర్ తో తెలియజేశారు.
ఇక ఈ విషయం తెలిసి తెలుగు సినీ ప్రేక్షకులు అలానే బాలయ్య అభిమానులు తెగ ఖుషి అయిపోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ ముఖ్యమైన పాత్రలలో కనిపించారు.
Also Read: AP CM YS Jagan: ఒప్పంద ఉద్యోగులకు దసరా కానుక, రెగ్యులరైజ్ చేస్తూ ఆదేశాలు
Also Read: Bhagavanth Kesari : హాఫ్ సెంచరీ కొట్టేసిన బాలకృష్ణ.. దసరా విన్నర్ షురు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..