NBK@50 Years: నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తైయిన సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆయన్ని ఘనంగా సత్కరించబోతుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు చిరంజీవి సహా పలువరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇక బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్,  సన్ని దేవోల్, షారుఖ్, రణ్ బీర్ కపూర్ హాజరు కానున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రలో సీనియర్ హీరోలైన చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేష్ లు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరు కాబోతున్నారు. అయితే.. యంగ్ హీరోల్లో అల్లు అర్జున్ ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్. సెప్టెంబర్ 1 హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించనున్నారు. ఈ సందర్బంగా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ను ప్లాన్ చేశారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టు సమాచారం.


అటు మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్, ముమ్ముట్టి, కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్, యశ్, కిచ్చా సుదీప్, దునియా విజయ్  తో పాటు రాక్ లైన్ వెంకటేష్ తో పాటు తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్,కమల్ హాసన్,విశాల్,విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్,  తదితర అగ్ర హీరోలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అటు హీరోయిన్స్ విషయానికొస్తే.. బాలయ్యతో నటించిన కథానాయికలను ప్రత్యేక ఆహ్వానాలు అందుకున్నారు. అటు దర్శకుల విషయానికొస్తే.. పి.వాసుతో పాటు బాలయ్యను డైరెక్ట్ చేసిన దర్శకులందరు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కాబోతున్నారు.  మొత్తంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవం కనీవినీ ఎరగని రీతిలో జరగనున్నాయి.


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.