Daaku Maharaj: డాకూ మహారాజ్ కి ఏపీ ప్రభుత్వం వరాలు.. బెనిఫిట్ షో, టికెట్ ధరల గురించి కీలక ప్రకటన..!
Daaku Maharaj Ticket Price: సంక్రాంతి సినిమాల టికెట్ల ధరలను.. భారీగా పెంచుకోవడానికి.. ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా గేమ్ చేజర్ టిక్కెట్ ధరల వివరాలను తెలియజేసిన ప్రభుత్వం.. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా వస్తున్న డాకూ మహారాజ్ సినిమా టికెట్ ధరల వివరాలు, బెనిఫిట్ షోల వివరాలు గురించి కూడా సమాచారం అందజేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Daaku Maharaj AP Benefit Show : బాలకృష్ణ హీరోగా.. బాబీ దర్శకత్వంలో వస్తోన్న సినిమా డాకూ మహారాజ్. రోజురోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. టీజర్ విడుదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు.. ఈ బాలయ్య సినిమా చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ అన్ని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవ్వడం విశేషం.
కాగా జనవరి ఐదున.. ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు సినిమా యూనిట్. అమెరికా నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో.. డల్లాస్‌లో ఘనంగా ఈవెంట్ నిర్వహించి మరి ఈ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు అని సమాచారం. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా టికెట్ రేట్ ల పెంపు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా డాకూ మహారాజ్ చిత్రానికి అదనపు షోలకు అనుమతి
కూడా మంజూరు చేసింది. ఈ చిత్రం జనవరి 12, 2025న విడుదల కానున్న సందర్భంగా, సినిమా థియేటర్లకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం జరిగింది.
జనవరి 12న ఉదయం 4:00 గంటలకు.. ప్రత్యేక బెనిఫిట్ షో ప్రదర్శించేందుకు అనుమతించిన ప్రభుత్వం.. ఈ షో కి రూ. 500 (జిఎస్‌టి సహా) టికెట్ రేటు పెట్టేందుకు ఒప్పుకున్నారు. అదే రోజున, మల్టీప్లెక్స్ థియేటర్లలో ఐదు షోలకు పర్మిషన్ మంజూరు చేశారు. ఇక టికెట్ రేట్ విషయాలకు వస్తే.. మల్టీప్లెక్స్ థియేటర్లకు..రూ. 135 అదనపు ఛార్జీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రూ. 110 అదనపు ఛార్జీ అనుమతించారు.
జనవరి 13 నుంచి 25 వరకు, రోజుకు ఐదు షోలను పై టికెట్ రేట్లతో ప్రదర్శించేందుకు అనుమతులు లభించాయి.
ఈ నిర్ణయం ఫిల్మ్ ప్రొడ్యూసర్ శ్రీ సూర్యదేవర నాగవంశి విజ్ఞప్తి ఆధారంగా తీసుకున్నారు అని తెలియజేశారు. అన్ని వివరాలను పరిశీలించి, సంబంధిత నియమావళి ప్రకారం, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది అని కూడా చెప్పుకొచ్చారు.
‘డాకూ మహారాజ్’ చిత్రం విడుదల నేపథ్యంలో ఈ అనుమతులు సినిమాకు భారీ ఆదరణను కలిగించనున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే.. అత్యంత భారీ కలెక్షన్ సాధించే సినిమాగా నిలవనంది అని ఎంతోమంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
ఇక ఈ సినిమాతో పాటు..సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ కానుండగా.. జనవరి 12న డాకూ మహరాజ్, జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కాబోతున్నాయి.
Read more: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook