Balakrishna Public Appearance after Akkineni Controversy: అక్కినేని తొక్కినేని వివాదం పెద్ద ఎత్తున చెలరేగిన తర్వాత ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా పబ్లిక్ లో కనిపించారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉంటున్న హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయన హిందూపురం వెళ్లారు. హిందూపురం సరస్వతి విద్యా మందిర్లో కంప్యూటర్లను పిల్లలకు పంపిణీ చేసిన తర్వాత బాలకృష్ణ అక్కడ మీడియాతో ముచ్చటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు వెళ్ళిపోతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ రావట్లేదని, పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలను కూడా ప్రభుత్వం వెళ్లగొడుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అని పేర్కొన్న ఆయన ఇలా ఉంటే ప్రజలు కూడా తిరగబడాలని పిలుపునిచ్చారు.


ఇక రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని పేర్కొన్న ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అనేక పరిశ్రమలు తీసుకొస్తామని అన్నారు. ఇక సేవా కార్యక్రమాలు చేయాలంటే అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదని, కానీ అభివృద్ధి చేయాలంటే మాత్రం అధికారం ఉండాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక చదువుకుంటేనే తనను సినిమాల్లోకి రావాలని ఎన్టీఆర్ అన్నారని అందుకే తాను డిగ్రీ చదువుకున్నానని అన్నారు.


ఒకవేళ సినిమాల్లో నేను రాణించ లేకపోతే చదువుకున్నాను కాబట్టి ఉద్యోగమైనా చేసుకోగలను అనే ముందు చూపుతో ఆయన అలా చెప్పారని ఈ సందర్భంగా బాలకృష్ణ పేర్కొన్నారు. అయితే సరదాగా మాట్లాడుతూ ఆయన ఎవరైనా నాకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే అంటూ ఆసక్తికరంగా స్పందించారు. అయితే బాలకృష్ణ అక్కినేని తొక్కినేని వివాదం మీద ఇప్పటివరకు స్పందించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన స్పందించి క్షమాపణలు చెప్పకపోతే ఎంత దూరం అయినా వెళ్తామంటూ అటు అక్కినేని అభిమానులు కామెంట్ చేస్తుంటే బాలకృష్ణ మాత్రం అసలు ఏమాత్రం స్పందించకపోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. 
Also Read: VSR vs WV Collections: 'వీర సింహ' వెనక్కు తగ్గినా నేను తగ్గనంటున్న వీరయ్య!


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook