Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

Tollywood Actor Sharwanand gets engaged With Rakshitha Reddy. టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకరైన శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 26, 2023, 12:37 PM IST
  • ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌
  • శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ పిక్స్
  • శర్వాకి కాబోయే భార్య రక్షితా రెడ్డి
Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

Tollywood Hero Sharwanand Gets Engaged With Rakshitha Reddy: టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకరైన శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగింది. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డితో శర్వాకు గురువారం ఉదయం నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ అంగరంగ వైభవంగా జరిగింది. శర్వా తన సింగిల్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి.. రక్షితా రెడ్డితో త్వరలోనే మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.

శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌కు శర్వా మిత్రుడు రామ్‌ చణ్ (Ram Charan)‌, ఆయన సతీమణి ఉపాసన హాజరయ్యారు. కాబోయే వధూవరులకు ఈ జంట ఆశీర్వదించారు. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు సమాచారం తెలుస్తుంది. శర్వా ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఓ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫొటోస్ చూసిన నెటిజన్లు కొత్త జంటకు విషెస్‌ చెబుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షితా రెడ్డి మరెవరో కాదట. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెనే రక్షితా రెడ్డి అన్ని సమాచారం తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు కూడా. రక్షితా యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అయితే శర్వానంద్‌, రక్షితా రెడ్డిలది ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదుర్చిన పెళ్లా అని తెలియాల్సి ఉంది. 

శర్వానంద్‌ చివరగా నటించిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. రితు వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలో నటించారు. టైం ట్రావెల్ కాన్సెఫ్ట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అనంతరం శర్వా మారె ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు బయటకు రాలేదు. పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంతోనే.. విరామం తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే శర్వా కొత్త సినిమాల గురించి ప్రకటిస్తారని సమాచారం.

Also Read: Shani Shukra Yuti 2023: 30 సంవత్సరాల తర్వాత శని-శుక్రుల మైత్రి.. ఈ 3 రాశుల వారికి ప్రతిరోజూ డబ్బేడబ్బు! పదోన్నతి పక్కా  

Also Read: Khurram Manzoor vs Virat Kohli: నేనే ప్రపంచ నం.1.. నా తర్వాత విరాట్ కోహ్లీ! పాకిస్తాన్ క్రికెటర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News