Balakrishna Responded on Comments about Nurses: నందమూరి బాలకృష్ణ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ కంటే ముందు దేవ బ్రాహ్మణుల కులానికి సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తర్వాత క్షమాపణలు చెబుతూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ తర్వాత వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలతో పాటు ఆ రంగారావు ఈ రంగారావు అనే మాటలు కూడా అనేకమందిని బాధించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపద్యంలోనే వారంతా సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తర్వాత బాలకృష్ణ ఆ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.  ఇక తాజాగా ఆయన అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ తో సరదాగా మాట్లాడుతూ నర్సులు గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మీద ఏపీ నర్సుల సంఘం ఫైర్ అయింది, క్షమాపణలు చెప్పకపోతే చాలా దూరం విషయం వెళుతుంది అంటూ పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద నందమూరి బాలకృష్ణ స్పందించారు.


ఈ మేరకు ఫేస్బుక్ వేదికగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేశారు. ‘’అందరికీ నమస్కారం నర్సులను కించపరిచారు అంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు, నా మాటలను కావాలనే వక్రీంచారని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. రోగులకు సేవలు అందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం అని పేర్కొన్న ఆయన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నర్సులు సేవలు ప్రత్యక్షంగా చూశానని అన్నారు.


రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులు అంటే నాకు ఎంతో గౌరవం అని మరోసారి పేర్కొన్నారు. వారికి ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అని పేర్కొన్న బాలకృష్ణ కరోనా వేళ ప్రపంచంలో ఎంతోమంది నర్సులు పగలనకా రాత్రనగా నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతో సేవలు అందించారని పేర్కొన్నారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలని నిజంగా నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడంతో అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి నర్సుల సంఘం నందమూరి బాలకృష్ణ ఖండనను ఎలా తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.


Also Read: Vani Jayaram Death Reason: వాణి జయరాం అసలు ఎలా చనిపోయారు? ఎవరైనా కొట్టి చంపారా?


Also Read: Ricky Kej Grammy: మూడో గ్రామీ అవార్డు అందుకున్న బెంగళూరు కంపోజర్.. ఇండియాకి అంకితం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.