Ricky Kej Dedicates Grammy Award to India: మూడో గ్రామీ అవార్డు అందుకున్న బెంగళూరు కంపోజర్.. ఇండియాకి అంకితం!

Grammys 2023 Award: అంతర్జాతీయ సంగీత వేదిక అయిన గ్రామీ అవార్డుల వేడుకలో భారతీయ సంగీత దర్శకుడు రిక్కీ కేజ్‌ మరోసారి విజయకేతనం ఎగురవేయడం హాట్ టాపిక్ అయింది.

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 8, 2023, 02:06 PM IST
Ricky Kej Dedicates Grammy Award to India: మూడో గ్రామీ అవార్డు అందుకున్న బెంగళూరు కంపోజర్.. ఇండియాకి అంకితం!

65th Grammy Awards 2023: సంగీత రంగంలో అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం నాడు అమెరికాలో అట్టహాసంగా జరిగింది. లాస్‌ ఏంజెల్స్​లో ఘనంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సంగీత కళాకారులు పాల్గొనగా అది ఈరోజు ఉదయం ఇండియాలో కూడా ప్రసారం అయింది. ఇక ఈ అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ సంగీత దర్శకుడు రిక్కీ కేజ్‌ మరోసారి విజయకేతనం ఎగురవేయడం హాట్ టాపిక్ అయింది.

వరుసగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక గ్రామీ పురస్కారాన్ని రిక్కీ కేజ్‌ అందుకున్నారు. ప్రముఖ అమెరికన్‌ కంపోజర్‌, రాక్‌ లెజెండ్‌ స్టీవర్ట్ కోప్లాండ్‌తో కలిసి రిక్కీ కేజ్‌ కంపోజ్ చేసిన 'డివైన్‌ టైడ్స్‌‌' ఆల్బమ్‌ బెస్ట్​ ఇమర్సివ్​ ఆడియో ఆల్బమ్​ కేటగిరీలో గ్రామీ పురస్కారాన్ని అందుకుంది. అంతకుముందు గత ఏడాది కూడా ఇదే ఆల్బమ్​.. బెస్ట్‌ న్యూ ఏజ్‌ ఆల్బమ్‌గా అవార్డు సొంతం చేసుకోవడం గమనార్హం. గ్రామీ అవార్డు గెలుపొందిన అనంతరం రిక్కీ అక్కడ ఉన్నవారందరికీ అభివాదం చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.

రిక్కీ కేజ్‌ మాట్లాడుతూ "డివైన్‌ టైడ్స్‌’’ ఆల్బమ్‌కు రెండో సారీ గ్రామీ అవార్డు పొందడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఇండియన్ మ్యూజిక్​ షార్ట్​లిస్ట్​ అయి ఆ తర్వాత ఈ ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు దక్కించుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని రిక్కీ కేజ్‌ అన్నారు. మరోపక్క ఈ గ్రామీ అవార్డుల కార్యక్రమంలో మహిళా గాయకురాలు బియాన్స్ సైతం చరిత్ర సృష్టించడం చర్చనీయాంశం అయింది. అదేమంటే అత్యధిక గ్రామీ అవార్డులు గెలుచుకున్న మహిళగా రికార్డులకెక్కింది.

తాజా పురస్కారంతో కలిపి ఇప్పటి వరకు బియాన్స్  32 గ్రామీ అవార్డులను గెలుచుకుంది. బియాన్స్ తర్వాత హంగేరియన్​-బ్రిటిష్​ కండక్టర్​ జార్జ్​ సోల్టి 31 గ్రామీ పురస్కారాలు దక్కించుకుని రెండవ స్థానంలో పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు అంతర్జాతీయ సింగర్స్​ భిన్నమైన డ్రెస్సులు ధరించి సందడి చేసి ఫోటోలకు పోజులిచ్చారు. ఇక ఇండియా నుంచి మూడో అవార్డు అందుకున్న రిక్కీ కేజ్‌ 2015లో స్టీవర్ట్ కోప్లాండ్‌తో కలిసి చేసిన 'విండ్స్‌ ఆఫ్‌ సంసార' ఆల్బమ్‌ రిక్కీకి మొదటి గ్రామీ అందుకున్నాడు.

అయితే అతనితో కలిసి పనిచేసిన స్టీవర్ట్ కోప్లాండ్‌కు తాజాగా వచ్చింది ఆరో గ్రామీ. ఇక రిక్కీ కేజ్‌ ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నారు. యూఎస్‌లో పుట్టిన రిక్కీ చాలా ఏళ్ల క్రితమే ఇండియా వచ్చి బెంగళూరులోనే స్థిరపడ్డారు. అలానే రిక్కీ కేజ్‌ఈ పురస్కారాన్ని అందుకున్న నాలుగో భారతీయుడు కాగా ఇండియా తరఫున ఈ పురస్కారాన్ని అందుకున్న అతి చిన్నవాడిగా రిక్కీ రికార్డులకెక్కాడు.
Also Read: Jr NTR Serious: ఇరికించిన సుమ, సీరియస్ అయిన ఎన్టీఆర్.. ఇంతకు ముందెన్నడూ ఇలా చూసి ఉండరు!

Also Read: Vani Jayaram Death Reason: వాణి జయరాం అసలు ఎలా చనిపోయారు? ఎవరైనా కొట్టి చంపారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News