నందమూరి బాలకృష్ణ నంది అవార్డుల వివాదంపై తొలిసారి స్పందించారు. ఇటీవల నంది అవార్డుల ప్రకటన వెలువడిన తరువాత సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే.  కొంతమంది బహిరంగానే విమర్శించగా, మరికొంతమంది అసంతృప్తితో ఉన్నారు. లెజెండ్ సినిమాకు 9 అవార్డులు రావటాన్ని కొందరు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో బాలయ్య తొలిసారి నంది అవార్డుల ప్రకటనపై స్పందించారు.


నంది అవార్డుల విషయంలో వివాదాలు వద్దు. సమిష్టి కృషితోనే లెజెండ్ సినిమా సక్సెస్ అయ్యింది అని అన్నారు. అందరూ కష్టపడ్డారు కాబట్టే లెజెండ్ సినిమాకు 9 అవార్డులు వచ్చాయి. ఆ సినిమా టైటిల్ ఆషామాషీ కాదని అన్నారు. లెజెండ్ సినిమాను నంది అవార్డులకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలని.. అవార్డు సాధించిన వారందరికీ అభినందనలు అని బాలకృష్ణ అన్నారు.