Bhagavanth Kesari: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నందమూరి బాలకృష్ణ సినిమా అనగానే అభిమానులు అందరూ ఆసక్తి ఎదురుచూసేది మాస్ డైలాగ్లు, యాక్షన్ సన్నివేశాలు, భారీ కమర్షియల్ ఎలిమెంట్ల కోసం. చాలా వరకు బాలకృష్ణ సినిమాలలో ఇవే ప్లస్ పాయింట్లుగా ఉంటాయి. సినిమాలో కథ ఉన్నా లేకపోయినా ఇవి మాత్రం కచ్చితంగా ఉంటాయి. బాలకృష్ణ సినిమాలలో చాలావరకు సన్నివేశాలు ఎలివేషన్లతోనే నిండి ఉంటాయి. పైగా బాలయ్య చేసేవన్నీ మాస్ సినిమాలే కావడంతో అవన్నీ హీరో పాత్ర చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటాయి.


కానీ తాజాగా ఇప్పుడు బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా విషయంలో మాత్రం ఇవేవి నిజం కాలేదు. బాలకృష్ణ పూర్తిగా ఈ సినిమాతో కమర్షియల్ సినిమాల ట్యాగ్ ను దాటేసారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ కొడుకు పాత్రలోనో మనవడి పాత్రలో చేయకుండా బాలకృష్ణ తన వయసుకి తగ్గ పాత్ర చేయటం అభిమానుల దృష్టి బాగా ఆకర్షిస్తోంది. ఇదే సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎలివేషన్లు అవసరం పడకుండా ఈ సినిమాకి కథ హీరోగా మారింది.


సినిమాలో బాలకృష్ణ భగవంత్ కేసరి పాత్ర పోషించగా ఆయన కూతురి పాత్రలో శ్రీ లీల (విజ్జీ పాప) కనిపించింది. సినిమా కథలో ఉన్న మంచి మెసేజ్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్లు లేకుండా కేవలం మంచి కథ మీద మాత్రమే దృష్టి పెట్టి సినిమాని తీసినట్లు తెలుస్తోంది. హీరో పాత్ర చుట్టూ సినిమా మొత్తం తిరగకుండా అందులో కథ హీరోగా మారడం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది.


కథ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. అనవసరంగా శ్రీ లీల ను కూడా ఆయన ఎక్కడా గ్లామరస్ గా చూపించాలని ప్రయత్నించలేదు. నిజానికి సినిమాలో ఆమె పాత్ర కొంచెం డీ గ్లామరస్ గానే అనిపిస్తుంది. సినిమాలో ఎలాంటి అనవసరమైన పాటలు కూడా లేవు. మంగమ్మగారి మనవడు సినిమా నుంచి దంచవే మేనత్త కూతురా పాట రీమిక్స్ ని బాగా ఖర్చు పెట్టి నిర్మించారు కానీ సెకండ్ హాఫ్ లో ఉండాల్సిన ఆ పాట మాత్రం సినిమా నుంచి తీసేశారు. దానికి కారణం ఆ పాట సినిమా కథని డిస్టర్బ్ చేస్తుంది అని సమాచారం. 


ఇక సినిమాకి తమన్ అందించిన అదిరిపోయే కొద్ది సంగీతం సినిమాకి కావలసినంత ఎలివేషన్లు అందించింది. ఆయన పాటలు యావరేజ్ గా మాత్రమే ఉన్నప్పటికీ నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగా హిట్ అయింది. చివరిగా చెప్పాలంటే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకి టిపికల్ కమర్షియల్ సినిమాలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. బాలకృష్ణ కోసమో లేక అనిల్ రావిపూడి కోసమో కాక ప్రేక్షకులు కథ కోసం సినిమా చూడటానికి ముందుకు వస్తున్నారు. అది ఈ సినిమా సాధించిన అతిపెద్ద విజయం అని కూడా చెప్పచ్చు.


Also Read: CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్  


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.