Balakrishna: గత కొన్నేళ్లుగా అక్కినేని, నందమూరి ఫ్యామిలీ మధ్య అంతగా పొసగడం లేదు. ముఖ్యంగా బాలయ్య.. నాగార్జున ఫ్యామిలీకి అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఏదో చిన్న ఇష్యూ కారణంగా బాబాయి అంటూ అక్కినేని నాగేశ్వరరావును  ఆప్యాయంగా పలకరించే బాలయ్య అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య ఓ సినీ ఫంక్షన్ లో అక్కినేని.. తొక్కినేని అంటూ వ్యాఖ్యలు చేయడంపై పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత దీనిపై అక్కినేని అభిమానులు బాలయ్య పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూస్తే ఇంటి నుంచి భార్య వసుంధరాతో పాటు తన పిల్లలను పంపించిన బాలయ్య.. తాను మాత్రం చివరి చూపుకు కూడా వెళ్లలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రీసెంట్ గా బాలయ్య 50వ సినీ స్వర్ణోత్సవ వేడుకకు నాగార్జునకు ఆహ్వానం అందినా... ఆయన బిగ్ బాస్ షో కూడా అదే రోజు ప్రారంభం కావడంతో ఆయన రాలేకపోయారు. అయితే.. బాలయ్య సినీ స్వర్ణోత్సవానికి నాగ్ రాకపోయినా.. అతని తరుపున చైతూను పంపించినా.. బాగుండేదనే ముచ్చట వినపడింది. తాజాగా బాలయ్య.. అన్ స్టాపబుల్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఎపిసోడ్ లో చిరంజీవి తో పాటు నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు గెస్ట్ లు రాబోతున్నట్టు సమాచారం.


ఈ నేపథ్యంలో బాలయ్య, నాగార్జున మధ్య చిరంజీవి మధ్యవర్తిగా సయోధ్య కుదిరేలా చేసినట్టు సమాచారం. అందుకే బాలయ్య.. తనకు తండ్రి ఎన్టీఆర్ తర్వాత ఎంతో ఇష్టంగా బాబాయి అని ఆప్యాయంగా పిలిచే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం విశేషం.


తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్బంగా ఆయన్ని స్మరించుకోవడం గర్వకారణమన్నారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలకు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన కృషి, కీర్తి, స్పూర్తి అందరికి ఆదర్శమన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అక్కినేని అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం అంటూ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.
 
నాటకరంగం నుండి సినిమా రంగం వరకు, ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ, ఆదర్శమన్నారు. అక్కినేని నాగేశ్వరరావు తో బాలయ్య మూడు చిత్రాల్లో నటించారు. తొలిసారి ‘భార్యభర్తల బంధం’ సినిమాలో నటించారు. ఇందులో మామ అల్లుళ్లుగ నటించారు. ఆ తర్వాత ‘గాండీవం’ చిత్రంలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇందులో తండ్రీ కొడుకులుగా నటించడం విశేషం. చివరగా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ‘వాల్మీకి’ పాత్రలో నటిస్తే.. బాలకృష్ణ ..శ్రీరామచంద్రుడి పాత్రలో ఒదిగిపోవడం విశేషం.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.