Balakrishna Upcoming Movies: అఖండ మూవీ సక్సెస్ తరువాత తన సెకండ్ ఇన్నింగ్స్ ను అఖండంగా మొదలుపెట్టిన బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్లతో బాక్స్ ఆఫీస్ ను బంతాట ఆడుతున్నాడు. దీంతో బాలయ్యతో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు ఎంతోమంది క్యూ కడుతున్నారు. అయితే బాలయ్య మాత్రం నాని కి సూపర్ సక్సెస్ అందించిన ఒక యువ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఇంతకీ బాలయ్య ను మెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఓ క్రేజీ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న బాబీ 2023 సంక్రాంతికి బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకు పోటీగా చిరంజీవితో వాల్తేరు వీరయ్య చిత్రం తీశాడు. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా.. నేనా అని పోటీ పడుతూ కలెక్షన్స్ వసూలు చేశాయి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవికి సూపర్ డూపర్ సక్సెస్ అందించాడు బాబీ. దీంతో ఇప్పుడు బాబీ, బాలయ్య కాంబోలో వస్తున్న చిత్రం పై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి.


బాబీ మూవీ తర్వాత బాలయ్య నెక్స్ట్ చిత్రం ఏమిటి అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోపక్క బాలయ్య కు సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన బోయపాటితో బాలయ్య నెక్స్ట్ మూవీ చేసే అవకాశం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క గీత ఆర్ట్స్ సంస్థ ఇటీవల బోయపాటితో సరికొత్త చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ మూవీ బోయపాటి బన్నీతో చేస్తాడా లేక బాలయ్యతో చేస్తాడా అన్న విషయంపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. కొంతమంది త్వరలో బోయపాటి బాలయ్య కాంబోలో అఖండ 2 చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది అని ప్రచారం చేస్తున్నారు. మరోపక్క ప్రశాంత్ వర్మతో బాలయ్య మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా బాలయ్య ఖాతాలో చాలామంది డైరెక్టర్ల చిత్రాలు లైన్ లో ఉన్నట్లు రూమర్స్ నడుస్తున్నాయి.


తాజాగా ఈ లిస్టులోకి నాని మూవీ డైరెక్టర్ వచ్చి చేరారు. నాని, సాయి పల్లవి కాంబోలో వచ్చిన పీరియాడిక్ సోషల్ ఫాంటసీ మూవీ..శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తో బాలయ్య మూవీ చేయబోతున్నట్లు టాక్. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈ మధ్యనే రాహుల్, బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్య కు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా స్టోరీ బాలయ్య కు పూర్తిగా నచ్చితే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కన్ఫామ్ అని తెలుస్తోంది.


Also Readహరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. బీఆర్ఎస్ ను ఏకీపారేసిన సీఎం రేవంత్ రెడ్డి..


Also ReadDengue Fever: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook