Akhanda : అఖండ సినిమా ఎద్దులకు ఓ రేంజ్లో ట్రైనింగ్..బోయపాటికి తెగ నచ్చేశాయట
Akhanda Movie Bulls : అఖండ మూవీలోని ఎద్దులతో.. బాలయ్య అరంగేట్రం కూడా మూవీలో అదిరిపోయింది. ఈ ఎద్దులు.. సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఆ మూవీని చూసిన వారిలో చాలా మందికి ఆ గిత్తెలను ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది.
Balakrishna's Akhanda Movie Bulls specialities: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తాజా మూవీ అఖండలో హైలైట్‌గా నిలిచింది అందులోని ఎద్దులు. ఆ ఎద్దుల ఫైటింగ్ సీన్స్ చూస్తే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. గతంలో మన తెలుగు మూవీలలో బుల్ ఫైట్స్ (Bull fights) బాగానే ఉండేవి. కానీ రానురాను అసలు అలాంటి సీన్స్ మన మూవీల్లో లేకుండా పోయాయి. మళ్లీ ఇప్పుడు బోయపాటి శ్రీను అఖండ మూవీతో (Akhanda Movie) ఆ ట్రెండ్‌ను తీసుకొచ్చాడు.
ఇక అఖండ మూవీలోని ఎద్దులతో.. బాలయ్య అరంగేట్రం కూడా మూవీలో అదిరిపోయింది. ఈ ఎద్దులు.. సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఆ మూవీని చూసిన వారిలో చాలా మందికి ఆ గిత్తెలను ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది.
అయితే ఈ ఎద్దులు నల్గొండ జిల్లా (Nalgonda District) చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారానికి చెందిన రైతు శ్రీనివాస్ యాదవ్‌కు (Srinivas Yadav) చెందినవి. శ్రీనివాస్ ఆంధ్ర నుంచి రెండు ఎద్దులను తీసుకొచ్చి వాటికి కృష్ణ, అర్జున (Krishna, Arjuna) అని పేర్లు పెట్టి పోషిస్తున్నాడు. ఇక కృష్ణుడు, అర్జునుడు అనే పేర్లు పెట్టి పిలిస్తే చాలు అవి పరుగునా వచ్చేలా శ్రీనివాస్ ట్రైనింగ్ ఇచ్చాడు. అఖండ మూవీలో (Akhanda Movie0 ఈ ఎద్దులు హీరో వెన్నంటి ఉంటూ పలు సీన్లలో అదిరిపోయే ఫర్మామెన్స్ ఇచ్చాయి. ఈ ఎద్దులకు సంబంధించిన ఒక వీడియో చూసిన అఖండ టీమ్ తమ మూవీలో ఎద్దులను పెట్టుకోవాలని భావించిందట. దీంతో శ్రీనివాస్ యాదవ్ ను (Srinivas Yadav) అడిగారట. ఆ విధంగా అఖండ మూవీలో తన ఎద్దులను ఉపయోగించుకున్నారని శ్రీనివాస్ చెప్పారు.
Also Read : Deepika Padukone : దీపిక, అనన్య రొమాన్స్‌లో రెచ్చిపోయారట.. అందుకే ఓటీటీలో రిలీజ్
ఇక సినిమా హిట్ కావడం.. అలాగే మూవీలోని ఎద్దులు కూడా ఫేమస్ కావడంతో వాటిని చూసేందుకు జనం తరలి వస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశాడు.బండలాగుడు బల ప్రదర్శనలోనూ ఈ ఎద్దులకు ట్రైనింగ్ ఇచ్చారు శ్రీనివాస్. ఎద్దులకు కావాల్సిన అన్ని మెళకువలు నేర్పించాడు. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తమ కృష్ణార్జునుల (Krishnarjuna) ప్రతిభను దగ్గరుండి పరిశీలించారని, వాటిని మెచ్చుకున్నారని శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రామోజీ ఫిలింసిటీలో జరిగిన అఖండ షూటింగ్‌లో రెండ్రోజుల పాటు ఈ ఎద్దులపై పలు సీన్స్‌ను చిత్రీకరించారు. మూవీ ప్రారంభ సన్నివేశంలో.. అలాగే క్లైమాక్స్ లో ఈ ఎద్దులు కనిపిస్తాయి. ఇక బాలకృష్ణ లాంటి హీరోతో కలిసి సూపర్ హిట్ మూవీలో తన ఎద్దులు నటించడం.. ఆ తర్వాత మంచి గుర్తింపు రావడం తనకు ఆనందంగా ఉందని శ్రీనివాస్ (Srinivas) సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : Health benifits of Cinnamon: దాల్చిన చెక్కతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook