Bhagavanth Kesari Release Date: ఈ మధ్య కాలంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో కెరియర్ లో ముందుకు దూసుకుపోతున్నారు. ఒక దాని తర్వాత మరొక బ్లాక్ బస్టర్ అందుకుంటూ తన సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న "భగవంత్ కేసరి" సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాపై రోజు రోజుకి పెరిగిపోతున్న అంచనాల వెనక కొన్ని కారణాలు కూడా ఉన్నాయట. అవి మరి ఏమిటో కాదు బాలకృష్ణ ముందు సినిమాలు అని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ పట్టిందల్లా బంగారంగా మారింది. అఖండ తోనే సూపర్ హిట్ అందుకున్న బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. 


ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. అఖండ సినిమాతోనే ఈ విషయాన్ని నిరూపించిన బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాతో మరొకసారి ఈ పాయింట్ ని స్పష్టం చేశారు. 


బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 51 కోట్లు నమోదు చేసింది. తాజాగా బాలకృష్ణ సినిమా బడ్జెట్ 80 కోట్లు కాగా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "భగవంత్ కేసరి" పై కూడా అదే రేంజ్ లో టాక్ మొదలైంది. మరి బాలకృష్ణ ఈ సినిమాతో ఎంతవరకు విజయాన్ని సాధిస్తారో చూడాలి.


ఏమైనా బాలకృష్ణ రీసెంట్ సక్సెస్ రేట్ ప్రస్తుతం ఆయన చేస్తున్న "భగవంత్ కేసరి సినిమాపై బాగా ఎక్కువ ప్రెజర్ ని చూపిస్తుంది. ముందు సినిమాలతో వరుసగా హిట్ లు అందుకున్న బాలయ్య ఈ సినిమాతో కూడా మరొక బ్లాక్ బస్టర్ అందుకుంటారు అని అభిమానులు ఇప్పటినుంచే కామెంట్లు చేస్తున్నారు. మరి బాలకృష్ణ తన సినిమాపై ఉన్న భారీ అంచనాలను అందుకుంటారో లేదో మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లాగా మారింది. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలకి సిద్ధం అవుతుంది. కాజల్ అగర్వాల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లీల ఈ సినిమా లో బాలయ్య కూతురిగా కనిపించనుంది.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి