Unstoppable With NBK Season 4: నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నడు లేనంతగా ఫుల్ ఊపు మీదున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో చాలా యేళ్ల తర్వాత హాట్రిక్స్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు బాలయ్య సినిమా నటుడిగానే కాకుండా అన్‌స్టాపబుల్ షోకు హోస్ట్‌గా ఈ షోను బ్లాక్ బస్టర్‌గా నిలిబెట్టారు. ఇప్పటికే అన్‌స్టాపబుల్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మధ్యలో భగవంత కేసరితో పాటు యానిమల్ టీమ్ కోసం స్పెషల్ ఎపిసోడ్స్ మధ్యలో చేశారు. తాజాగా సీజన్‌ 4కు రంగం సిద్ధమైంది. ఉగాది సందర్బంగా ఈ ప్రోగ్రామ్ త్వరలో ప్రసారం చేయబోతున్నట్టు ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావారణంతో హడావుడిగా ఉంది. బాలకృష్ణ.. హిందూపురం నుంచి మూడోసారి తెలుగు దేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా  పోటీ చేస్తున్నారు. ఆ హడావుడి ముగిసిన తర్వాత 'అన్‌స్టాపబుల్ సీజన్ 4' స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు బాలయ్య.. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' ప్రారంభం కానుంది. అయితే అన్‌స్టాపబుల్ టాక్ షో నాల్గవ సీజన్‌లో విత్ ఏ ట్విస్ట్ అంటూ కొంచెం సస్పెన్స్ మెయింటెన్ చేసారు. మరి 'అన్‌స్టాపబుల్ సీజన్ 4' షో ఎలా ఉండబోతుందో చూడాలి.


Also Read: Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter