Unstoppable episode with Akhanda team: అఖండ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న బాలయ్య బాబు తన అన్‌స్టాపబుల్ టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఓ సంచలన ప్రకటన చేశారు. అఖండ మూవీ యూనిట్ అయిన డైరెక్టర్ బోయపాటి శ్రీను, విలన్ క్యారెక్టర్ చేసిన శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌లను హోస్ట్ చేసిన బాలకృష్ణ.. వారితో చాలా సరదాగా సంభాషించారు. తాజాగా అఖండ మూవీ యూనిట్‌తో కలిసి చేసిన లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను (Unstoppable latest episode promo) ఓటిటి ప్లాట్‌ఫామ్ రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలోనే బాలకృష్ణ ఆ సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ ఆ సంచలన ప్రకటన ఏంటా అనే కదా మీ డౌట్.. అయితే ఆలస్యం ఎందుకు.. ఆ ప్రోమో ఏంటో మీరే చూసేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : RRR Ramcharan Poster: రోరింగ్ రాంచరణ్... ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయిన కొత్త పోస్టర్


అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో (Unstoppable episode with Akhanda team) బాలయ్య బాబు మాట్లాడుతూ.. మంచి కథతో ఎవరైనా దర్శకులు ముందుకొస్తే, విలన్‌గా చేయడానికి నేను రెడీ అని ప్రకటించారు. ఆ వెంటనే ఆయన మరో షరతు విధించాడు. విలన్‌గా చేస్తాను అని ఎంత ఉత్కంఠకు గురిచేశారో.. అలాగే ఆ సినిమాలో హీరో కూడా నేనే అని చెప్పి మళ్లీ అంతే నవ్వించారు. 


Also read : Pushpa Trailer: పుష్ప ట్రైలర్ కోసం తగ్గెదేలే అంటున్న Allu Arjun fans


అఖండ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌ని ఆట పట్టిస్తూ సరదా సంభాషణలు, తోటి నటుడు శ్రీకాంత్‌తో కలిసి అఖండ్ డైలాగ్స్ (Akhanda dialogues) గుర్తుచేసుకోవడం, ప్రగ్యా జైశ్వాల్, థమన్‌తో ఆడించిన ఆటలు.. ఇలా ఒకటేమిటి.. ఎపిసోడ్ ఆద్యంతం ఫన్నీగా ఉంటుందనిపించేలా అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో కట్ చేశారు. అన్‌స్టాపబుల్ సిరీస్‌లో ఇది 4వ ఎపిసోడ్. అన్నింటికి మించి చంద్రబాబు నాయుడు ఆనాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీని లాక్కున్నారని జరుగుతున్న ప్రచారంపై కూడా బాలయ్య బాబు (Balakrishna about Chandrababu Naidu and Ntr) స్పందించడం గమనార్హం.


Also read : Akhanda movie: అఖండ మూవీ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌తో NBK fan మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook