Bandla Ganesh Audio Leak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఈవెంట్ అనగానే.. చాలామంది బండ్ల గణేష్ వస్తున్నాడా లేదా అని ఆరా తీస్తారు. పవన్ సినిమా ఈవెంట్‌లో బండ్ల స్పీచ్‌కి ఉండే క్రేజ్ అది. గతంలో 'ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వరా' అంటూ పవన్ గురించి బండ్ల ఇచ్చిన స్పీచ్‌కి ఆడిటోరియమంతా చప్పట్లు, నవ్వులతో దద్దరిల్లిపోయింది. బండ్ల నోట పవన్ నామస్మరణ ఫ్యాన్స్‌కి అంతలా కిక్ ఇస్తుంది. అలాంటి బండ్లను 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దూరం పెడుతున్నారా.. తాజాగా బండ్ల గణేష్ పేరిట నెట్టింట వైరల్ అవుతున్న ఆడియోతో ఈ చర్చ మొదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌తో మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో కాల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో సదరు అభిమాని పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తున్నారా అన్నా అంటూ బండ్ల గణేష్‌ని అడిగాడు. అందుకు బండ్ల గణేష్ స్పందిస్తూ.. మొదట వెళ్తున్నానమ్మా అని చెప్పారు. దీంతో సదరు అభిమాని.. స్పీచ్ రెడీ చేశారా అన్నా.. చింపేయాలన్నా ఈసారి అంటూ అడిగాడు. ఆ వెంటనే బండ్ల అందుకుని.. స్పీచ్ రెడీ చేశానమ్మా.. అయితే త్రివిక్రమ్ రావొద్దన్నాడంట.. వాడు డౌన్ అవుతాడని.. నాకేమో వెళ్లాలనుంది.. మంచి డైలాగ్స్ కూడా రాసుకున్నాను.' అని చెప్పుకొచ్చారు.


పిలవకున్నా సరే.. ఈవెంట్‌కి రావాలని అభిమాని కోరగా.. అలా వెళ్తే బాగోదమ్మా అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. అంతేకాదు, త్రివిక్రమ్ వైసీపీ వాళ్లతో ప్లాన్ చేసుకున్నాడంటా అంటూ ఏదో చెప్పబోయారు. అయితే.. ఈవెంట్ సమయంలో ఆడిటోరియంలో బండ్లన్నా రావాలి అంటూ గట్టిగా అరవమని బండ్ల గణేశ్ అతనికి సలహా ఇచ్చాడు. తాను అక్కడే ఉంటానని... అలా అందరూ అరవగానే.. వెంటనే స్టేజీ పైకి వచ్చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది మిమిక్రీ వాయిస్ అని కొందరు.. కాదు బండ్ల గణేష్ వాయిసే అని మరికొందరు సోషల్ మీడియాలో వాదించుకుంటున్నారు.


మరోవైపు బండ్ల గణేష్.. తన పేరిట చక్కర్లు కొడుతున్న ఆడియో కాల్‌లోని వాయిస్ తనది కాదన్నారు. అసలు దానిపై స్పందించనని చెప్పారు. ఈ ఆడియో కాల్ పవన్ ఫ్యాన్స్‌ను మాత్రం కొంత బాధిస్తోంది. ఒకవేళ బండ్ల గణేష్ నిజంగానే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాకపోతే.. ఆయన స్పీచ్‌ను చాలా మిస్ అవుతామని వారు అభిప్రాయపడుతున్నారు.



Also Read: Trending Video: 9 మూతలు 8 అయ్యాయి.. 9=8?? 99% మంది ఫెయిల్ అయ్యారు.. ట్రై చేయండి!


Also Read: Flying Car Video: పక్షిలా గాల్లోకి తుర్రున ఎగిరే కారును ఎప్పుడైనా చూశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook