Bandla Ganesh Google Pay : వెయ్యి రూపాయలు గూగుల్ పే చేసిన బండ్ల గణేష్.. నెటిజన్ల కామెంట్లు వైరల్
Bandla Ganesh Google Pay బండ్ల గణేష్ తాజాగా ఓ వెయ్యి రూపాయలు గూగుల్ పే చేశాడు. దాని స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేయసాగారు.
Bandla Ganesh Google Pay బండ్ల గణేష్ బడా ప్రొడ్యూసర్‌గా, కమెడియన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక బండ్ల గణేష్ ఇచ్చే స్పీచులు, అందులో మాట్లాడే మాటలు, వాడే ప్రాసలు, పేల్చే బుల్లెట్ల లాంటి మాటల తూటాలకు అందరూ ఫిదా అవుతుంటాడు. పవన్ కళ్యాణ్ భక్తుడు అంటూ బండ్లన్న ఇచ్చే స్పీచులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలా బండ్ల గణేష్‌కంటూ ఓ ఇమేజ్ ఉంది. ఇప్పుడు బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.
కరోనా కాలంలో ఎంతో మందికి సాయం చేశాడు. ఉద్యోగాలు పెట్టించే ప్రయత్నం చేశాడు. అడిగిన వారికి చేతనైనంతా డబ్బు కూడా ఇచ్చాడు. ఇలా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చేతనైన సాయం చేస్తూనే వస్తున్నాడు. అయితే తాజాగా ఓ నెటిజన్ వేసిన ట్వీట్‌కు స్పందించాడు. వెయ్యి రూపాయలు గూగుల్ పే చేశాడు. ఓ దివ్యాంగురాలి బాధ చూసిన బండ్ల గణేష్ ఆ అమ్మాయి వివరాలు కావాలని అడిగాడు.. దీంతో ఓ నెటిజన్ గూగుల్ నంబర్ పంపించాడు.
చివరకుగా బండ్ల గణేష్ వెయ్యి రూపాయలు గూగుల్ పే చేశాడు. దాన్ని ట్విట్టర్‌లో పెట్టాడు. దీంతో బండ్ల గణేష్ మీద కొంత మంది నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. నీ రేంజ్‌కు వెయ్యి రూపాయలు ఇవ్వడం ఏంటి? అన్నా అని నిలదీస్తున్నారు. ఈ మాత్రం దానికి డీటైల్స్ కావాలని అడిగావా? అని అంటున్నారు. అది కరెక్టైన నంబర్ అవునో కాదో చెక్ చేసి ఉంటాడు.. మళ్లీ పెద్ద మొత్తంలో డబ్బు పంపించి ఉంటాడు అని మరో నెటిజన్ కామెంట్ పెట్టేశాడు.
పంపించిందే వెయ్యి రూపాయలు దానికి కూడా పబ్లిసిటీయా? అంటూ మరో నెటిజన్ నెగెటివ్ కామెంట్ చేశాడు. ఇది కూడా గ్రేట్.. కనీసం అది కూడా పంపని వాళ్లున్నారు కదా? అని ఇంకో నెటిజన్ అనేశాడు. అలా మొత్తానికి బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ మాత్రం పెద్ద ఎత్తున చర్చకే దారి తీసింది. మరి నిజంగానే బండ్ల గణేష్ వెయ్యి రూపాయలే? పంపించాడా? ఇంకా ఎక్కువే పంపించాడా? అన్నది తెలియడం లేదు.
Also Read : Rashmika Mandanna : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్.. లోపల జరిగేది వేరంటూ నోరు విప్పిన రష్మికా మందన్న
Also Read : Anupama Parameswaran: అక్కడ టాటూతో అనుపమ పరమేశ్వర్ రచ్చ.. లేటెస్ట్ పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook