Bandla Ganesh on Chandrababu With Vijayasai reddy వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు వరుస అవుతాడని చాలా మందికి తెలియదు. తారకరత్న హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి తుది శ్వాస విడిచే వరకు కూడా విజయసాయి రెడ్డి ఎప్పటికప్పుడు అప్డేట్ల గురించి వాకబు చేస్తూనే వచ్చాడట. ఇక తారకరత్న చనిపోవడం, పార్థివ దేహాన్ని స్వగృహానికి తీసుకురావడం దగ్గరి నుంచి అన్నింట్లోనూ విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శనార్థం మొకిలలో ఆదివారం ఉంచారు. అక్కడే విజయసాయి రెడ్డి చంద్రబాబు ఎదురుపడ్డారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. అయితే వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా ఒకరినొకరు తిట్టుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ ఉండే ఈ ఇద్దరూ ఇలా కనిపించే సరికి అంతా ఆశ్చర్యపోయారు.


 



చావులు, పెళ్లి వంటి వాటి వద్ద శత్రుత్వాన్ని చూడకూడదని, అందరినీ మర్యాదగా పలకరించడం మన ఆనవాయితీ అని అంటుంటారు. అయితే బండ్ల గణేష్‌ మాత్రం చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఫోటో మీద దారుణమైన కామెంట్లు చేశాడు. నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం  కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి అని ట్వీట్ వేశాడు.


అర్థం లేకుండా మాట్లాడకు .. తారకరత్న విజయసాయిరెడ్డి అల్లుడు నందమూరి వారసుడు కష్ట కాలంలో ఒకే సమయంలో కలవాల్సి వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు నువ్వు నీ పిచ్చి ట్విట్స్ ఆయనికి తెలిసింది ఒకటే అది ఎవరు వచ్చినా గౌరవంగా మాట్లాడి పంపడం ఇంటి గడప తొక్కుకొని వచ్చిన వాడు శత్రువు అయినా సరే అది ఇలాంటి ఒక సంధర్బంలో నీలాగ చేస్తే వాన్ని మనిషి అనరు బండ్ల భయ్యా నువ్వు సింహం అనుకుంటున్నావా.. పాలిటిక్స్ వేరు పర్సనల్ లైఫ్ వేరు.. నీలాంటి చీడపురుగులు ఈ సమాజంలో ఉండకూడదు..  అంటూ బండ్ల గణేష్‌ను జనాలు తిట్టిపోస్తున్నారు.


Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం


Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook