Bandla Ganesh Devara Title బండ్ల గణేష్‌ దేవర అంటూ పవన్ కళ్యాణ్‌ను స్టేజ్ మీద పొగడటం, నెట్టింట్లో వేసే ట్వీట్లు అందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో పవర్ స్టార్ ఫ్యాన్స్‌ మాత్రం ఈ దేవర టైటిల్ మీద బాగానే మనసు పడ్డారు. ఆ టైటిల్‌ను సైతం తాను రిజిష్టర్ చేయిస్తానని చెప్పుకొచ్చాడు. కానీ బండ్ల గణేష్ మాత్రం టైటిల్‌ను రిజిష్టర్ చేయించలేదు. దీంతో ఆ టైటిల్‌ను కొరటాల శివ వాడేసుకున్నాడు. ఎన్టీఆర్ కోసం కొరటాల శివ ఈ దేవర టైటిల్‌ను పెట్టేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బండ్ల గణేష్ తాజాగా దేవర టైటిల్ మీద స్పందించాడు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా శుక్రవారం నాడు ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే దేవర టైటిల్ మీద బండ్ల గణేష్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. దేవర   నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్  నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్  కొట్టేశారు అని బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు బండ్ల గణేష్ మీద ఫైర్ అయ్యారు. దెబ్బకు బండ్ల గణేష్ స్వరం మార్చేశాడు.


నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్   ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా ఆయన కూడా నాకు దేవరే అంటూ ఎన్టీఆర్ అభిమానులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు బండ్ల గణేష్. అయితే ఈ టైటిల్ మాత్రం చాలా పవర్ ఫుల్‌గా ఉందని అంతా అనుకుంటున్నారు. అన్ని భాషల్లోనూ ఈ టైటిల్ ఒకేలా సౌండ్‌ ఇవ్వడం, చాలా పవర్‌ఫుల్‌గా ఉండటం, మంచి రెస్పాన్స్ వస్తుండటంతో టీం అంతా హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.


Also Read:  Rajinikanth Last Movie : రజినీ లాస్ట్ సినిమా అదేనా?.. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సూపర్ స్టార్


ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్లు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. వచ్చే ఏడాదిన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఏప్రిల్ 5న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.


Also Read:  Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా హాట్ ట్రీట్.. చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook