Surekha Konidela Birthday మెగా ఫ్యామిలీకి నేడు (ఫిబ్రవరి 18) పండుగ లాంటిది. చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల పుట్టిన రోజు అంటే మెగా ఫ్యామిలీ అంతా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేస్తుంటుంది. తాజాగా సురేఖమ్మకు విషెస్ చెబుతూ బండ్ల గణేష్‌ వేసిన ట్వీట్ అందరినీ మెప్పిస్తోంది. సీతాదేవి అంత ఓర్పు భూదేవంత గొప్పతనం లక్ష్మీదేవి లాంటి నవ్వు .. రాముడి లాంటి భర్తకు అర్ధాంగిగా, వజ్రంలాంటి బిడ్డకు తల్లిగా, ఎందరో లక్ష్మణులకు వదినగా మీరుండటం మాకెంతో సంతోషం.. ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరున్ని మనసారా కోరుకుంటూ.. అని ట్వీట్ వేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



బండ్ల గణేష్‌ మెగా ఫ్యామిలీ గురించి చెప్పినా, చిరంజీవి గురించి పొగిడినా, పవన్ కళ్యాణ్‌ను కీర్తించినా, రామ్ చరణ్‌ను చోటా బాస్ అంటూ ఆకాశానికెత్తేసిన అందరూ చెవులు రిక్కించి వినాల్సిందే. బండ్ల గణేష్‌ చెప్పే మాటలు, మెగా ఫ్యామిలీని ఎత్తే విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మాటల మాంత్రికుడు కూడా బండ్ల గణేష్‌ ముందు చిన్నబోయినట్టుగా అనిపిస్తుంది.


అలా బండ్ల గణేష్‌ వేసే ట్వీట్లు, ఇచ్చే స్పీచులు, మాట్లాడే మాటలు, పేల్చే తూటాలు మెగా ఫ్యాన్స్‌కు కిక్కిస్తుంటాయి. తాజాగా బండ్ల గణేష్‌ వేసిన ఈ ట్వీట్ మెగా ఫ్యాన్స్ మనసును దోచేశాయి. సురేఖమ్మ గురించి బండ్ల గణేష్‌ ఎంతో గొప్పగా చెప్పాడంటూ నెటిజన్లు మురిసిపోతోన్నారు. మీరు చెప్పింది అక్షరాల సత్యం అంటూ జనాలు కూడా ఒత్తాసు పలుకుతున్నారు.


బండ్ల గణేష్‌ అసలే ఇప్పుడు తన భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం పడుతోంది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్‌ తన గబ్బర్ సింగ్ రెమ్యూనరేషన్ విషయంలో చేసిన కామెంట్లతో కొంత మంది పవర్ స్టార్ అభిమానులు బండ్లన్న మీద ఆగ్రహంతో ఉన్నారు. 


బండ్ల గణేష్ వర్సెస్ కొంత మంది పవర్ స్టార్ అభిమానుల మధ్య జరిగిన వాగ్వాదం అందరికీ తెలిసిందే. తన భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తన దేవుడు ఎప్పటికీ పవన్ కళ్యాణే అని బండ్ల గణేష్‌ వేస్తోన్న ట్వీట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.


Also Read:  vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ.. కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడోచ్


Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook