Bandla Ganesh to Launch a News Channel Soon: సినీ నటుడు నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఒక ఛానల్ పెట్టబోతున్నానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ టీవీ 27వ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ బండ్ల గణేష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియోకి ఒక నెటిజన్ సర్ మీరు కూడా న్యూస్ ఛానల్ పెట్టొచ్చు కదా అంటూ కామెంట్ చేయడంతో దానికి తాను ప్లానింగ్ లో ఉన్నానని బండ్ల గణేష్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినీ పరిశ్రమలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ తర్వాత కమెడియన్ గా మంచి పేరు సంపాదించారు. అయితే అనూహ్యంగా నిర్మాత అవతారం ఎత్తిన ఆయన పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. అదే విధంగా ఆయన ఖాతాలో పలు డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బండ్ల గణేష్ మరో సినిమా ఏదీ ప్రకటించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా ఉంటుందని ప్రకటించారు.


కానీ దానికి డైరెక్టర్ ఎవరు? ఇతర టెక్నీషియన్స్ ఎవరు? అనే విషయం మీద క్లారిటీ లేదు. ఇటీవల ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చెబితే అదే శిరోధార్యం, ఆయన అభిమానులుగా ఆయన ఉన్నతమైన ఆలోచనకు అండగా ఉండాలని అంటూ బండ్ల గణేష్ వేదాంతం మాట్లాడుతుండటంతో ఆ సినిమా దాదాపు క్యాన్సిల్ అయినట్లేనని భావిస్తున్నారు.


ఇక ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల జీవిత రాజశేఖర్ దంపతులకు సంబంధించి కూడా పలు ఆరోపణలు గుప్పించారు. ఆయన ఇక ప్రస్తుతం బండ్ల గణేష్ న్యూస్ ఛానల్ పెట్టబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ప్లానింగ్ కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి మరి.


Also Read: Jr NTR Movie in 9 Languages: ఎన్టీఆర్ సినిమా నెవర్ బిఫోర్ ఫీట్.. ఏకంగా తొమ్మిది బాషలలో?


Also Read: Anasuya Bharadwaj Non stop Tweets: అనసూయ ఆంటీ అన్నా తప్పే అక్కా అన్నా తప్పే.. ఈ పంచాయితీ ఆగేది ఎప్పుడు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి