Anasuya Bharadwaj Non stop Tweets: అనసూయ ఆంటీ అన్నా తప్పే అక్కా అన్నా తప్పే.. ఈ పంచాయితీ ఆగేది ఎప్పుడు?

Anasuya Bharadwaj Non stop Retweeting Abusing tweets: తనని బూతులు తిడుతున్నారు అంటూ తిడుతున్న అన్ని ట్వీట్లను రీ ట్వీట్ చేస్తూ రచ్చ రేపుతోంది అనసూయ. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2022, 02:31 PM IST
Anasuya Bharadwaj Non stop Tweets: అనసూయ ఆంటీ అన్నా తప్పే అక్కా అన్నా తప్పే.. ఈ పంచాయితీ ఆగేది ఎప్పుడు?

Anasuya Bharadwaj Non stop Retweeting Abusing tweets: నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అనసూయ, ఆంటీ అనే పదాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. లైగర్ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ గతంలో ఒక సినిమా ప్రమోషన్స్ కోసం వాడిన బూతు పదాన్ని గుర్తు చేస్తూ అనసూయ భరద్వాజ్ చేసిన ట్వీట్ కలకలం రేపింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదని, కర్మ వదలదని ఆమె కామెంట్లు చేసింది. దేవరకొండ అభిమానులు ఆమెను టార్గెట్ చేసి రకరకాల బూతులతో విరుచుకుపడుతున్నారు. సాధారణంగా ఇలాంటి పరిణామాలు గతంలో కూడా చాలా చోటుచేసుకున్నాయి.

అనసూయ కూడా లైట్ గానే తీసుకునేది. కానీ ఈసారి ఎందుకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నదో ఏమో ఆమె తన పనులన్నీ పక్కనపెట్టి మరి సోషల్ మీడియాలో  తనను బూతులు తిడుతున్న వారి ట్వీట్లను రీ ట్వీట్ చేస్తూ వాళ్లకు తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తోంది. తనను సపోర్ట్ చేసే వారిని క్షమించమని అడుగుతూనే తాను చేస్తున్న ట్వీట్లతో మీ టైంలైన్స్ నిండిపోతున్నాయని నాకు తెలుసు కానీ మీ కారణాలతో నన్ను సపోర్ట్ చేయడానికి బయటకు రావడం లేదు కానీ మీ మనసులో నన్నే సపోర్ట్ చేస్తున్నారని నాకు తెలుసు, కానీ నాకు ప్రూఫ్ కావడం కోసమే ఇన్ని ట్వీట్లను రీ ట్వీట్ చేస్తున్నానని, ఇవన్నీ కూడా పోలీసులకు సమర్పించి వారికి సరైన శిక్ష పడేలా చేస్తానని ఆమె చెబుతోంది.

అయితే సోషల్ మీడియాలో ఊరు పేరు లేని అకౌంటులకు కూడా శిక్ష తప్పదని ఆమె హెచ్చరిస్తున్నారు. అయితే చాలామంది అసలు అనసూయ ఇలా కామెంట్ చేయడం ఎందుకు? ఆమె ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుందని ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎన్ని బూతులు విన్నా, చూసినా ఎందుకొచ్చిన తలనొప్పి అని లైట్ తీసుకుంటారు. కానీ అనసూయ మాత్రం తనదైన లాజిక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఇలా హల్చల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ముందుగా ఆంటీ అనకూడదు అని కామెంట్ చేసిన ఆమె తరువాత అక్కా అని కూడా పిలవకూడదని చెప్పుకొచ్చింది.

ఇక ఆంటీ అనే పేరుతో 60 వేల ట్వీట్లు వచ్చాయంటే ఈ విషయం మీద అనసూయ అలాగే ఆమె ట్రోలర్లు ఎంత దృష్టి పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అనసూయను అయ్యో పాపం అనే వారికంటే నీ నోటి దూలతోనే ఇంతవరకు తెచ్చుకున్నావని అంటున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. బూతు షోలలో కామెడీ చూసి ఎంజాయ్ చేసే నువ్వు సినిమా ప్రమోషన్స్ లో బూతు మాటలు ఆడారని దాని మీద రచ్చ చేయడం ఇప్పుడు ఇలా పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగడం కరెక్ట్ కాదని సలహాలు ఇస్తున్నారు.

మరికొందరైతే ఇదంతా నీకెందుకు అనసూయ ? ఏం పని లేదా? అని కూడా కామెంట్లు చేస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి ముగింపు లేదా అని ఒకరు అడిగితే మీ చేతుల్లోనే ఉంది, ఆన్లైన్లో ఇలా దూషణలకు దిగుతున్న వారికి సరైన రీతిలో జవాబు చెప్పండి, ఖండించండి అలా చేస్తూ పోతే వారికి తప్పని తెలిసి వచ్చి వాడి వికృత చర్యలు ఆపినప్పుడు ముగింపు ఉంటుంది లేదా చట్ట ప్రకారం శిక్షపడినప్పుడు ఇది ఆగుతుందంటూ చెబుతున్నారు. 

Also Read: Brahmastra Pre release Event: పాన్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్..కాలర్ ఎగరేస్తున్న ఫాన్స్..!

Also Read: Liger Movie 2 Days Collections: రెండో రోజు దారుణంగా కలెక్షన్స్.. కానీ హిందీలో మాత్రం అదుర్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News