Bandla Ganesh Tounge Slip at Dhamaka Movie Success Meet: ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి లాభాలు పాట పట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ మీట్లో నిర్మాత బండ్ల గణేష్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సక్సెస్ ఈవెంట్లో సినిమా సక్సెస్ గురించి రవితేజ గురించి చాలా గొప్పగా మాట్లాడిన బండ్ల గణేష్ చివరిలో సినిమా తీసిన దర్శకుడు గురించి మాట్లాడుతూ నోరు జారి బూతు మాటలు మాట్లాడేశారు. సినిమా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు అంటూనే ఒక బూతు మాట మాట్లాడడంతో అక్కడున్న అందరూ షాక్ అయ్యారు.




అయితే ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గమనించారు బండ్ల. సోషల్ మీడియాలో నెటిజన్లు బండ్ల గణేష్ ను టార్గెట్ చేయడంతో ఇప్పుడు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. సారీ బై మిస్టేక్ వచ్చేసింది కావాలని అన్నది కాదు అంటూ ఆయన ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా సినిమాకు ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు.


ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద వివేక్ కూచిభొట్ల నిర్మించారు. అదేవిధంగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. బండ్ల గణేష్ కు రవితేజకు మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బండ్ల గణేష్ గతంలో ప్రొడక్షన్ వైపు పనిచేస్తున్న సమయంలో రవితేజ సినిమాలో హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు.


బండ్ల గణేష్  నిర్మాతగా మారిన తర్వాత చేసిన మొట్టమొదటి సినిమా కూడా రవితేజతోనే. ఆంజనేయులు పేరుతో బండ్ల గణేష్ చేసిన సినిమా మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. అప్పట్లో బండ్ల గణేష్ కి మంచి లాభాలు కూడా తెచ్చి పెట్టింది. ఈ నేపద్యంలో వీరిద్దరి సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకొని మేకర్స్ బండ్ల గణేష్ ని కార్యక్రమానికి పిలిస్తే ఆయన పొరపాటున బూతు మాటతో నెటిజన్లకు దొరికిపోయారు, చివరికి సారీ చెప్పారు.
Also Read: Samantha Ruthprabhu New Year Wishes: అందుకు ఇదే సరైన సమయం.. హాట్ టాపిక్ గా మారిన సమంత పోస్టు


Also Read: మూడు పెళ్లిళ్లు-మూడు పేర్లు, రెండో భర్తతో అలా ఉందని భార్యను దారుణంగా చంపిన మూడో భర్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి