Bangarraju Movie: అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా రేపు (జనవరి 14న) థియేటర్లలో విడుదల (Bangarraju Movie release date) కానుంది. సంక్రాంతి బరిలో దిగిన పెద్ద సినిమా ఇదొక్కటే కావడంతో.. మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా విడుదల నేపథ్యంలో అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఇందులో బంగార్రాజు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు (Akkinenu Nagarjuna on Bangarraju Movie) వెల్లడించారు.


యూత్​ ఫుల్ ఎనర్జీ..


ఈ సినిమాలో యూత్​ ఫుల్ ఎనర్జీ ఉంటుందని నాగార్జున అన్నారు. సోగ్గాడే చిన్న నాయనా సినిమాలో సర్​ప్రైజ్​గా అనుష్కను చూపించగా.. బంగార్రాజులో వేరే వేరే సర్​ప్రైజ్​లు ఉన్నాయని చెప్పారు నాగ్​. నాగ చైతన్యను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని చెప్పుకొచ్చారు.


ఈ సినిమా కోసం నాగ చైతన్యకు చాలా విషయాలు నేర్చుకున్నాడని నాగార్జున తెలిపారు. అందుకే సినిమా సక్సెస్​లో యాక్టింగ్ పరంగా క్రెడిట్​ నాగ చైతన్యకే చెల్లుతుందని (Nagarjuna about Naga Chaitanya) చెప్పారు.


తెలుగులోనే మాట్లాడుతుంది..


ఇక హీరోయిన్ కృతి శెట్టి కూడా సినిమాలో చాలా బాగా నటించిందని చెప్పారు నాగ్​. తను తెలుగు నేర్చుకుని సెట్లో ఎప్పుడు తెలుగులోనే మాట్లాడేదన్నారు. అమెపై ఎలాంటి కంప్లైంట్​ కూడా (Nagarjuna about Kriti Shetty) లేదని చెప్పారు.


రమ్య కృష్ణ, నాగార్జున అంటేనే హిట్​ జోడి అనే ముద్ర ఉందని చెప్పారు నాగార్జున. రమ్య కృష్ణతో కలిసి పని చేయడం ఎంతో సరదాగా ఉంటుందన్నారు.


మ్యూజిక్  డైరెక్టర్ అనూప్​ రూబెన్స్ అన్నపూర్ణ స్టూడియోస్​తో కుటుంబంలో ఉంటాడని.. ట్యూన్​ నచ్చలేదంటే ఫీల్​ అవడని చెప్పుకొచ్చారు. సినిమాకు అద్భుతమైన మ్యూజిక్  అందించాడని తెలిపారు.


బంగార్రాజు సినిమా గురించి..


2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ఇది ప్రీక్వెల్​. ఈ సినిమా కూడా సంక్రాతికి రిలీజ్​ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది.


బంగార్రాజు సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా ఉప్పెన ఫేమ్​ కృతి శెట్టి హీరోయిన్లుగా (Bangarraju Cast) చేశారు. రావు రమేశ్, వెన్నెల కిశోర్​, ఝాన్సీ, ప్రవీణ్​ సహా పలువురు ఈ సినిమాలో నటించారు.


కల్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టడియోస్​, జీ స్టూడియోస్​ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. నాగార్జునానే నిర్మాతగా వ్యవహరించారు. అనూప్​ రూబెన్స్  సినిమాకు సంగీతమందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.


Also read: Chiranjeevi chief guest for Ravanasura : మాస్ మహారాజా మూవీ కోసం మెగాస్టార్ వస్తున్నారు..


Also read: Mouni Roy Bikini Photos: బికినీ ఫొటోలతో సోషల్ మీడియాను డామినేట్ చేస్తున్న మౌనీరాయ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook