Actress murder case: ఇటీవల కనిపించకుండా పోయిన బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిమూ కథ విషాదంగా ముగిసింది. ఢాకా కెరానిగంజ్​లోని హజ్రత్​పూర్​ వంతెనకు సమీపంలో గోనె సంచిలో అమె విగత జీవిగా (Bangaldeshi actress murdered) కనిపించారు. సోమవారం.. స్థానిక పోలీసులు అమె మృత దేహం లభించినట్లు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వార్తా సంస్థ ఐఏఎన్​ఎస్​ ప్రకారం.. స్థానికలు అందించిన సమాచారం మేరకు పోలీసులు రైమా ఇస్లాం షిమూ మృత దేహాన్ని రికవరీ (Bangaldeshi missing actress dead) చేనట్లుతెలిసింది.


షిమూ మృత దేహంపై గాయాలను గుర్తించిన పోలీసులు.. అమె భర్త షఖావత్​ అలీ నోబుల్, అతడి స్నేహితుడు ఫర్హాద్​లను తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. ఈ దారుణాననికి పాల్పడింది తామేనని (Raima Islam Shimu killed) అంగీకరించారు. అదివారం షిమూ కనిపించకుండా పోయినప్పుడు.. భర్త అలీ నోబుల్​ పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేయడం గమనార్హం.


అయితే హత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం షిమూ భర్త సహా, మరో నింధితుడు పోలీసుల అదుపులోనే (Raima Islam Shimu Murder case) ఉన్నారు.


కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లు ఓ ప్రముఖ నటుడి హస్తం కూడా ఈ హత్యకు కారణమనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.


షిమూ.. మృత దేహానికి పోస్ట్ మార్టమ్​ కోసం సలీముల్లా మెడికల్ కాలేజ్​ హాస్పిటల్​కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇంకా అందాల్సి ఉందని (Raima Islam Shimu latest news) వివరించారు.


రైమా ఇస్లామ్​ షిమూ గురించి..


రైమా ఇస్లామ్ షిమూ వయస్సు 45 సంవత్సరాలు. 1998లో వచ్చిన బర్తమాన్​ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అమె కెరీర్​లో 25 సినిమాల వరకు నటించారు.


సినిమాలు మాత్రమే కాకుండా.. టీవీ కార్యక్రమాల్లో నటించడం, ప్రొడ్యూస్​ చేయడం వంటివి కూడా చేశారు షిమూ. బంగ్లాదేశ్ ఫిల్మ్​ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​లో సభ్యురాలిగా (Raima Islam Shimu bio) కూడా ఉన్నారామే.


Also read: Pooja Hegde Bikini Photo: మాల్దీవుల్లో బుట్టబొమ్మ అందాల ఆరబోత.. బికినీలో వయ్యారాలు!


Also read: Naina Ganguly Photos: సోషల్ మీడియాలో బోల్డ్ హీరోయిన్ నైనా గంగూలీ అందాల ఆరబోత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook