Bappi Lahiri News: ప్రముఖ సంగీత స్వరకర్త బప్పి లహిరి (69) బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఇటీవలే అనారోగ్యంతో ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. నేడు తుదిశ్వాస విడిచారు. మంగళవారం రాత్రి బప్పి లహిరి ఆరోగ్యం మరింతగా క్షీణించగా.. సకాలంలో చికిత్స అందించినా లాభం లేకపోయిందని వైద్యుల వెల్లడించారు. బప్పి లహిరి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో లెజండరీ సింగర్ కు నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సంగీత సామ్రాట్ కు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బప్పి లహిరి వ్యక్తిగతం


బప్పి లాహిరి అసలు పేరు అలోకేష్ లాహిరి. 1952 నవంబరు 27న పశ్చిమ బెంగాల్ లోని జలపయిగురిలో జన్మించారు. ఈయనను బప్పి డా, డిస్కో కింగ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించిన బప్పి లహిరి తండ్రి పేరు అపరేష్ లహిరి, తల్లి పేరు బన్సారి లహిరి. 1977 జనవరి 24న చిత్రాణి లహిరిని బప్పి లహిరి పెళ్లి చేసుకున్నారు.


సంగీత వాయిద్యాలపై మక్కువ  


బప్పి లాహిరికి చిన్ననాటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేది. తన చిన్న వయసులోనే తబలా, పియానో, డ్రమ్స్, గిటార్.. ఇతర సంగీత వాయిద్యాలను వాయించడం నేర్చుకున్నారు. ఆ తర్వాత సంగీతంపై మక్కువతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. అనతి కాలంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. 


'గోల్డ్ ఈజ్ మై గాడ్'


సంగీత స్వరకర్త బప్పి లహిరికి బంగారం అంటే చాలా ఇష్టం. బంగారంపై ఉన్న మక్కువతోనే తాను సువర్ణ అభరణాలను ధరిస్తానని ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తనకు ఇష్టమైన అమెరికన్ పాప్ సింగర్ పాప్ స్టార్ ఎల్విన్ ప్రెస్లీ.. తన మెడ నిండా బంగారు ఆభరణాలను ధరించేవాడిని బప్పి లహిరి అన్నారు. అతడి ప్రభావం తనపై పడడం వల్ల తాను కూడా బంగారాన్ని ధరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 


రాజకీయాల్లో..


సింగర్ బప్పి లహిరి.. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బంగాల్ లోని శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలో ఆయన ఓటమిని చవిచూశారు. అదే సమయంలో తాను ధరించే బంగారు ఆభరణాల గురించి అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయన వద్ద 754 గ్రాముల గోల్డ్, 4.62 కిలోల వెండి ఉంది. ఆయన భార్య చిత్రాణి లహిరి వద్ద 967 గ్రాములు, 8.9 కిలోల బంగారం.. రూ. 4 లక్షలు విలువ చేసే డైమెండ్ ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.   


Also Read: Bappi Lahri Passes away: బ్రేకింగ్ న్యూస్.. ప్రముఖ సింగర్ బప్పి లహరి కన్నుమూత


Also Read: Bappi Lahiri: బప్పి లహిరి మెడ నిండా బంగారం.. ఎందుకలా కనిపించేవాడో తెలుసా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook