Bappi Lahiri Passes Away: ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి కన్నుమూశారు. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన లహిరి.. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బప్పి లహిరి మరణం సంగీత అభిమానులను విషాదంలో ముంచెత్తింది. లహిరి మరణం నేపథ్యంలో ఆయన పాటలు, సంగీతం, వ్యక్తిగత జీవిత విశేషాలను అభిమానులను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బప్పి లహిరి 'గోల్డ్' గురించి కూడా చాలామంది ఆరా తీస్తున్నారు.
బప్పి లహిరి అనగానే మదిలో వెంటనే ఓ లుక్ స్ట్రైక్ అవుతుంది. కాస్త జులపాల జట్టు, కళ్లకు నల్ల అద్దాలు, మెడ నిండా బంగారంతో కనిపిస్తుంటారు. బప్పి లహిరికి బంగారమంటే అమితమైన ఇష్టం. 'గోల్డ్ ఈజ్ మై గాడ్' అనేది తన ఫేవరెట్ కొటేషన్‌గా చెబుతుండేవారు. బంగారంపై తనకు ఎందుకంత ఇష్టం ఏర్పడిందో బప్పి లహిరి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అప్పట్లో అమెరికన్ పాప్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీ తన మ్యూజిక్ కాన్సర్ట్స్‌లో మెడ నిండా బంగారంతో కనిపించేవాడని... అది చూశాక తనకు అలా కనిపించాలనే ఆసక్తి ఏర్పడిందని బప్పి లహిరి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను సక్సెస్ అయిన రోజు అలా బంగారంతో కనిపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాక.. ఆయన మెడ నిండా బంగారంతో కనిపించేవారు.
బప్పీ లహిరి 2014 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన వద్ద ఉన్న బంగారం వివరాలను అందులో వెల్లడించారు. దాని ప్రకారం.. బప్పి లహిరి వద్ద 754 గ్రాముల గోల్డ్, 4.62 కిలోల వెండి ఉంది. ఆయన భార్య వద్ద 967 గ్రాముల గోల్డ్, 8.9 కిలోల బంగారం, రూ.4 లక్షలు విలువ చేసే డైమండ్ ఉంది. తల్లిదండ్రుల సంగీత వారసత్వంతో ఎదిగొచ్చిన బప్పి లహిరి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాటలు పాడారు. ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Bappi Lahri Passes away: బ్రేకింగ్ న్యూస్.. ప్రముఖ సింగర్ బప్పి లహరి కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook