Bastar Movie Trailer Talk Review: సిల్వర్ స్క్రీన్ పై ఎవర్ గ్రీన్ ఫార్ములా పోలీస్ స్టోరీ. హీరో ఖాకీ డ్రెస్ వేసుకుంటే ఆ సినిమా సూపర్ హిట్టే అని చెప్పాలి. ఆ తర్వాత లాయర్, జర్నలిస్ట్, ఫ్యాక్షనిస్ట్, డాక్టర్ ఇలా సమాజానికి సంబంధించిన ప్రతి పాత్రపై సినిమాలు తెరకెక్కాయి. వాటితో పాటు నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో పలు చిత్రాలు వచ్చాయి. అందులో ఎక్కువగా వాళ్లను హీరోలుగా చూపిస్తూ వచ్చిన చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. కానీ ఇపుడు 'ది కేరళ స్టోరీ' మూవీతో సంచలనం రేపిన దర్శకుడు సుదీప్తో సేన్.. ఇపుడు నక్సలిజంలోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తూ 'బస్తర్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. మన దేశంలో నక్సలిజం పురుడుపోసుకుంది పశ్చిమ బంగాల్‌లోని నక్సల్‌బరి గ్రామంలో అయినా... ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా దేశ వ్యాప్తంగా నక్సలిజం పలు ప్రాంతాల్లో ప్రబలింది. గతంలో పలు గ్రూపులుగా ఉన్న నక్సల్స్ అందరు కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్‌గా పేరు మార్చుకుంది. నక్సలైట్స్ కు ప్రస్తుతం కేంద్ర బిందువుగా ఉన్నది మాత్రం చత్తీస్‌గడ్‌లోని జగదల్ పూర్‌లోని బస్తర్ ప్రాంతం.   దీన్నే దండకారణ్యం అంటారు. ఇది చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ, ఏపీల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లోనే నక్సలైట్స్ తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటారు.  ఇండియన్ మావోయిస్టులు.. ISIS, బొకోహరామ్ తర్వాత మూడో అతిపెద్ద తీవ్రవాద సంస్థ అని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ సినిమాలో ముఖ్యంగా నక్సలైట్స్ (మావోయిస్ట్)ల హింస కారణంగా చనిపోయిన పోలీసులు, త్రివిద దళాలు, స్థానిక గిరిజనులు ఎలాంటి పరిస్థితులును ఫేస్ చేసారనేది ఈ సినిమా ట్రైలర్‌లో చూపెట్టారు. ముఖ్యంగా అప్పట్లో బస్తర్ జిల్లాలోని సుక్మాలో జరిగిన 76 మంది జవానులు చనిపోయారు. ఆ తర్వాత మన దేశం ఆపరేషన్ ఆల్ ఔట్ పేరుతో చేసిన ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సుదీప్తో సేన్. ఇందులో నక్సలైట్స్‌ను ఎదుర్కొనే పోలీస్ అధికారి పాత్రలో అదా శర్మ అద్బుతంగా నటించింది. అటు మావోయిస్ట్‌లుగా నటించిన నటీనటులు తమ పాత్రల్లో జీవించారు.


మన దేశ మిలటరీ పాకిస్థాన్‌తో చేసిన నాలుగు యుద్దాల్లో చనిపోయిన దాని కంటే అంతర్గత శత్రవులైన నక్సలైట్స్ కారణంగా అంతకు రెండింతలు ఎక్కువగా చనిపోయినట్టు మన గణాంకాలు చెబుతున్నాయి. పేరులోనే సీపీఐ మావోయిస్ట్  పెట్టుకొని.. చైనా తొత్తులుగా ఎలా వీళ్లు వ్యవహరిస్తురనేది ఈ సినిమాలో చూపెట్టాడు దర్శకుడు సుదీప్తో సేన్. మరోవైపు వీళ్లకు అండగా నిలబడే అర్బన్ నక్సల్స్, కొంత మంది మీడియా అధినేతలు, రాజకీయ నాయకులు తీరును ఎండగట్డాడు దర్శకుడు. ఈ సినిమా మార్చి 15న దేశ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.  మొత్తంగా 'ది కేరళ స్టోరీ' మూవీ తర్వాత 'బస్తర్' సినిమాతో దర్శకుడు ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.


Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.