Bigg Boss Telugu 7 Promo-24th September: బిగ్ బాస్ సీజన్ 07న మూడోవారం క్లెమాక్స్ కు వచ్చింది. ఇంటి నుంచి వెళ్లిపోనున్న మూడో కంటెస్టెంట్ ఎవరో నేడు తేలిపోనుంది. వీకెండ్ ఎపిసోడ్ కు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్య అతిథిగా వచ్చినట్లు ప్రోమోలో చూపించారు మేకర్స్. ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోల్లో ఏముందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్లతో కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించారు నాగార్జున. ముందుగా చిట్టి ప్రశ్నలనే గేమ్ పెట్టారు. ఇందులో చక్రం తిప్పాలని.. దాంట్లో వచ్చిన కలర్ ఆధారంగా తన వద్ద ఉన్న బాక్సులో చిట్టీలు తీసి ప్రశ్నలు అడుగుతానని నాగ్ చెప్పారు. ఆ తర్వాత హీరో రామ్ వీకెండ్ ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. స్కంద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.  "నాతో కళ్లజోడు పెట్టుకొని మాట్లాడి.. అమ్మాయిలు కనిపించగానే కళ్లజోడు తీసేశాడు''అని రామ్‍ను ఆట పట్టించే ప్రయత్నం చేశారు నాగ్. అనంతరం కంటెస్టెంట్లతో మాట్లాడారు రామ్. దీని తర్వాత ప్రశాంత్-అమర్ దీప్, ప్రియాంక-శోభా శెట్టి డ్యాన్స్ చేయడాన్ని ప్రోమోలో చూపించారు. 


నిన్న ప్రిన్స్ యావర్ సేఫ్ అవటంతో.. మూడో వారం నామినేషన్స్ లో ప్రియాంక జైన్, అమర్ దీప్ చౌదరి, శుభశ్రీ, రతిక రోజ్, దామిని, గౌతమ్ కృష్ణ ఉన్నారు. వీరిలో కొందరి ఫోటోలు ఉన్న పలకలను సుత్తితో పగులగొట్టారు నాగార్జున. దీంతో కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని ప్రోమోలో చూపించారు. ఇలా ఎందుకు చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఓటింగ్ లో సింగర్ దామిని వెనుకబడి ఉన్న నేపథ్యంలో ఈ వారం ఎలిమినేట్ అవకాశాలు ఎక్కువగా  ఉన్నాయని ఆడియెన్స్ అంచనా వేస్తున్నారు. 


Also Read: Sreeleela: విజయ్ దేవరకొండ మూవీ నుంచి శ్రీలీల ఔట్.. కారణం ఇదేనట..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook