Bigg Boss 7 Telugu Finale voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు రేపటితో ఎండ్ కార్డు పడనుంది. ఫినాలేకు సంబంధించిన షూటింగ్ అల్రెడీ మెుదలు పెట్టేశారు. ఫైనల్ కు ముందు ఓ సాలిడ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. తక్కువ ఓట్లు పడిన కారణంగా అతడు హౌస్ నుంచి వెళ్లాల్సి వస్తోంది. మెుత్తం ఆరుగురు హౌస్ మేట్స్ ఫైనల్సిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, ప్రియాంక ఉన్నారు. వీరిలో ఎవరు కప్ కొడతారు, ఎవరు ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుంటారు, ఎవరు రన్నరప్ గా నిలుస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. అంతకంటే ముందు టాప్-6 కంటెస్టెంట్స్ కాస్తా టాప్-5గా మారనున్నారు. అయితే నిన్నటితో ఓటింగ్ క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. శనివారం ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రధానంగా ఫినాలే పోటీ ముగ్గురు కంటెస్టెంట్ల మధ్యే తిరుగుతోంది. అత్యధికంగా ఓట్లు వారికే పోలవుతున్నాయి. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీలకు ఎక్కువ ఓటింగ్ జరిగింది. చివరి స్థానాల్లో ప్రియాంక జైన్, అర్జున్ అంబటి నిలిచారు. తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా అర్జున్ ను ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. 


అర్జున్ సీజన్ మెుదట్లోనే వచ్చి ఉంటే టాప్-3లో ఉండేవాడు. అతడు చాలా తెలివైన వాడు, పైగా కండబలం ఉన్నవాడు. వైల్ కార్డుతో వచ్చినప్పటికీ తన వంద శాతం ఇచ్చాడు. ఎన్ని నొప్పులు ఉన్నప్పటికీ టాస్కులు అద్భుతంగా ఆడాడు. అంతేకాకుండా ఫినాలే ఆస్త్ర గెలుచుకున్న తొలి కంటెస్టెంట్ గా కూడా నిలిచాడు. అయితే ఆడియెన్స్ నుంచి ఓట్లు రాబట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. 


Also Read: Bigg Boss 7 Telugu Winner: ముగ్గురి మధ్యే టైటిల్ పోరు.. అయితే గెలిచేది మాత్రం అతడే!


ఇక విన్నర్ ఎవరనే విషయానికొస్తే... ముగ్గురు మధ్య టైటిల్ పోరు నడుస్తోంది. పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉండగా.. కాస్త అటు ఇటుగా అమర్, శివాజీ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అమర్ ను శివాజీ తిట్టడం మైనస్ అయింది. దీంతో శివాజీ ఓటింగ్ కాస్త తగ్గింది. దీంతో సెకండ్ పొజిషన్ కు అమర్ దూసుకొచ్చాడు. అనధికారిక సర్వే ప్రకారం, కొందరు ప్రశాంత్ విన్నర్ అంటే.. మరికొందరు అమర్ విజేతగా నిలుస్తాడని అంటారు. బిగ్  బాస్ విన్నరో ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఓపిక పట్టాల్సిందే.


Also Read: Salaar Tickets: సలార్ తొలి టికెట్ కొన్న రాజమౌళి.. ధర ఎంతో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook