Salaar Tickets: సలార్ తొలి టికెట్ కొన్న రాజమౌళి.. ధర ఎంతో తెలుసా?

Salaar Movie: ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ మూవీ సలార్. తెలుగు రాష్ట్రాల్లో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ నేటి నుండి ప్రారంభంకానున్నాయి. ఈ మూవీ తొలి టికెట్ ను దర్శకధీరుడు రాజమౌళి భారీ మెుత్తానికి కొనుగోలు చేశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 02:44 PM IST
Salaar Tickets: సలార్ తొలి టికెట్ కొన్న రాజమౌళి.. ధర ఎంతో తెలుసా?

Salaar: Part 1- Ceasefire First ticket: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) నయా మూవీ సలార్. కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో శుక్రవారం నుంచే కర్ణాటకలో సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుండి బుకింగ్స్ ఓపెన్ కానున్న నేపథ్యంలో.. సలార్ తొలి టిక్కెట్‌ను టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు రాజమౌళి కొనుగోలు చేశారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70MM థియేటర్‌లో తొలి టికెట్ ను బుక్ చేసుకున్నారు దర్శకధీరుడు. ఈ టికెట్ ను జక్కన్న 10,116 రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రాజమౌళి ఇంత భారీ ధర చెల్లించి టికెట్ కొనడంతో మూవీపై వీరలెవల్లో అంచనాలు పెరిగిపోయాయి. 

అయితే సలార్ విడుదల తేదీ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ మాత్రం చేయడం లేదు మేకర్స్. ఇప్పటి వరకు ఇంటర్వ్యూ గానీ, ప్రెస్ మీట్ గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ గానీ నిర్వహించలేదు చిత్రయూనిట్. సలార్ ను ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నరట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హోంబళే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, సునీల్  తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. 

Also read: Bigg Boss 7 Telugu Winner: ముగ్గురి మధ్యే టైటిల్ పోరు.. అయితే గెలిచేది మాత్రం అతడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News