Beast Movie Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతి, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్‌'. ఏప్రిల్ 13న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ లో జోరు పెంచేసింది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను ఉగాది సందర్భంగా చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ గెటప్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన 'డాక్ట‌ర్' ఫేమ్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.  ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా హీరో శివకార్తికేయన్ రచించిన 'అరబిక్ కుతు' పాటకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. 



యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 'డాక్టర్' మూవీలో నటించిన కమెడియన్స్ ఇందులోనూ నటిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని మరో లిరికల్ సాంగ్ 'జాల్లీ ఓ జింఖానా' సాంగ్ కూడా మూడున్న‌ర కోట్ల‌కు పైగా వ్యూస్‌ దక్కించుకుంది. దీన్ని హీరో విజయ్ పాడడం విశేషం.  


Also Read: Jacqueline Fernandez Photos: బుల్లిగౌనులో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న లంక బ్యూటీ!


Also Read: Ananya Nagalla Photos: లంగాఓణీలో 'వకీల్ సాబ్' భామ అనన్య సందడి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook