Sreekaram: భలేగుంది బాలా... మీరూ చూస్తే పోలా..
Bhalegundi Baalaa song teaser: శర్వానంద్, ప్రియాంక అరుల్మోహన్‌లు జంటగా శ్రీకారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘భలేగుంది బాలా’ అనే పాట టీజర్‌ను గురువారం సాయంత్రం ఈ చిత్ర బృందం విడుదల చేసింది. దీనిని హీరో శర్వానంద్ ( Sharwanand ) తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

ప్రసిద్ధ రాయలసీమ జానపద కళాకారుడు పెంచల్ దాస్ ( Penchal das ) రాసి, పాడిన ఈ పాటకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు. ఈ ఫుల్ సాంగ్‌ని నవంబర్ 9న విడుదల చేయనున్నారు. ఈ పాటలో పల్లెటూరి మట్టి వాసన తెలుస్తోంది అని చెప్పొచ్చు. Also read : Narappa teaser: నారప్ప టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్
శర్వానంద్ 30వ సినిమా అయిన 'శ్రీకారం' సినిమా ( Sreekaram movie ) సేంద్రీయ వ్యవసాయం నేపధ్యంలో తెరకెక్కుతోంది. అంతేకాకుండా నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ ఒక రైతుగా కనిపించనున్నాడు. ఈ సినిమాతో కిషోర్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. రామ్ ఆచంట, గోపి ఆచంట, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. Also read : Bigg Boss 4 Telugu: అభిజీత్ గురించి వాళ్లమ్మ ఏం చెప్పిందంటే