Varudu Movie Completes 13 Years వరడు సినిమా పదమూడేళ్లైన సందర్భంగా ఇలా సెలెబ్రేట్ చేసుకుంటున్నాను.. నా మనసులో ఆ సినిమా పట్ల ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం, ప్రేమ ఉంటాయి.. ఇప్పుడు నా కాశ్మీర్ ట్రిప్‌ నా మనసులో ఎలా ఉండిపోయిందో.. వరుడు సినిమా కూడా అలానే నిలిచిపోతుంది.. వరుడు సినిమా నుంచి ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీ వరకు నేను ప్రతీ క్షణం ఎంజాయ్ చేస్తూనే పని చేశాను అంటూ చెప్పుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుడు సినిమా 2010లో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గుణ శేఖర్, అల్లు అర్జున్ కాంబోలో సినిమా అవ్వడం, ఐదు రోజులు పెళ్లి అంటూ ఆశలు రేపడం.. హీరోయిన్‌ను ప్రమోషన్స్‌లో ఎక్కడా చూపించకపోవడం, సినిమా ప్రారంభం అయి నలభై నిమిషాలు అయినా హీరోయిన్‌ను చూపించకపోవడం, అసలు హీరోయిన్ అంత అందంగా ఉందా? అందుకే ఇంత ఊరిస్తున్నారా? అని అంతా అనుకున్నారు. కానీ తీరా భాను శ్రీని చూసి జనాలు నిట్టూర్చారు. ఈ హీరోయిన్ కోసమా? ఇంత దాచి పెట్టి ఉడికించారు? అని పెదవి విరిచారు.


అలా వరుడు సినిమా డిజాస్టర్ అవ్వడానికి భాను శ్రీ కూడా ప్రత్యక్షంగా కారణమైంది. అయితే భాను శ్రీని ఆ తరువాత టాలీవుడ్ మేకర్లు ఎవ్వరూ కూడా హీరోయిన్‌గా పెట్టుకోలేదు. పెద్ద హీరోలు అయితే ఆమె వైపు కూడా చూడలేదు. ఆమె చేసిన అడపాదడపా సినిమాలు కూడా అంతగా ఆడలేదు. దీంతో సైలెంట్‌గా పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని సాగిస్తూ వస్తోంది.


 



ఇక సోషల్ మీడియా ఊపందుకున్న తరువాత ఆమె తనకంటూ ఓ యూట్యూబ్ చానెల్‌ను పెట్టుకుంది. అందులో రకరకాల వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది. వెకేషన్లు, పార్టీలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె కాశ్మీర్ ట్రిప్ వేసినట్టుంది. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. మొన్నటికి మొన్న బన్నీ తనను అన్ బ్లాక్ చేశాడంటూ వాపోవడం,ఆ స్క్రీన్ షాట్లను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఒక్కసారిగా భాను శ్రీ లైమ్‌ లైట్‌లోకి వచ్చింది.


Also Read:  Honey Rose Pics : బాప్‌ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ


Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook