Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే

Nithiin Vakkantham Vamsi నితిన్ వక్కంతం వంశీ కాంబోలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ మీద ఆయన అభిమానులు అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ఆ అయిష్టాన్ని నేరుగా సోషల్ మీడియాలో పెట్టేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 08:07 AM IST
  • నితిన్ బర్త్ డే స్పెషల్
  • వక్కంతం వంశీపై కామెంట్
  • కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల పెదవి విరుపు
Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే

Nithiin Vakkantham Vamsi ఈ మధ్య అభిమానులు సోషల్ మీడియలో ఎలా ఉంటున్నారో అందరికీ తెలిసిందే. అభిమాన హీరో అయినా సరే వారి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్.. ఆ సినిమా ఎందుకు చేశావ్.. ఎందుకు ఇంత లేట్ అవుతోంది.. అప్డేట్లు ఇవ్వు అన్నా అంటూ ఇలా అడిగేస్తున్నారు. నిలదీస్తున్నారు. అయితే నితిన్ బర్త్ డే (మార్చి 30) సందర్భంగా నిన్న సోషల్ మీడియాలో కొత్త సినిమా అప్డేట్లు కూడా వచ్చాయి.

ఈ క్రమంలో వక్కంతం వంశీ నితిన్‌ ప్రాజెక్ట్ చర్చల మీదకు వచ్చింది. నితిన్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ ట్వీటేశాడు వంశీ. అయితే ఆయన వేసిన ట్వీట్‌ మీద నితిన్ కూడా స్పందించాడు. దీంతో ఓ అభిమాని తన అసంతృప్తిని వెల్లగక్కాడు. దానిపైనా నితిన్ స్పందించాడు. తమ సినిమా మీదున్న కాన్ఫిడెన్స్‌ను ట్వీట్ రూపంలో బయటపెట్టేశాడు.

కొన్ని బంధాల గురించి మాటల్లో చెప్పలేం.. అలాంటిదే మన బంధం.. హ్యాపీ బర్త్ డే నితిన్.. మనం ఎలాంటి సినిమా చేస్తున్నామో ఆడియెన్స్‌కు చూపించాలని వెయిట్ చేస్తున్నా అని వక్కంతం వంశీ చెప్పుకొచ్చాడు. థాంక్యూ సో మచ్ డార్లింగ్.. మన కంటెంట్ డిలే అయినా.. ఇంపాక్ట్ డబుల్ ఉంటుంది.. కిక్ యాస్ స్టఫ్ వస్తుంది.. అందరికీ సారీ.. కాస్త ఓపిక పట్టండి.. ఈసారి మాత్రం డిజప్పాయింట్ చేయను.. లవ్యూ ఆల్ అని పెట్టాడు నితిన్. 
 

ఆల్రెడీ మేం డిజప్పాయింట్ అయ్యాం అన్నా.. చాలా థాంక్స్ అన్నా.. బర్త్డేను బాగా గుర్తుండేలా చేశావ్ లే అని హర్ట్ అయ్యాడు ఓ అభిమాని. సినిమా మీ అందరికీ ఇంకా బాగా గుర్తుండిపోయేలా మీ అందరికీ తెగ నచ్చేలా చేస్తా తమ్ముడు అని ఎంతో కూల్‌గా రిప్లై ఇచ్చాడు నితిన్. మరి వీరి కాంబోలో వచ్చే సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. 

 

నితిన్ చివరగా చేసిన మాచర్ల నియోజకవర్గం ఎంతలా డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక సినిమా హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాపులు ఇస్తున్నానంటూ తన మీద తానే ట్రోల్స్ వేసుకున్నాడు నితిన్. వెంకీ కుడుముల నితిన్ రష్మిక కాంబోలో కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Also Read:  Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?

Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News