సరిగ్గా 21 సంవత్సరాల క్రితం కమల్ హాసన్ హీరోగా నటించిన "భారతీయుడు" సినియా ఎంతటి ఘన విజయం సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. విశేష ప్రేక్షక ఆదరణ పొందిన ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. సీక్వెల్ గా వస్తున్న 'భారతీయుడు2 (ఇండియన్2)' సినిమాకు మరోసారి శంకర్ డైరక్టర్ గా  వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు ముందుకు వచ్చారు. ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని హీరో కమల్ హాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు . సుమారు 180 కోట్ల బడ్జెట్‌తో భారతీయుడు -2  సినిమా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు  నిర్మాత దిల్ రాజు తన ఫేస్ బుక్ ఖాతా లో స్పందించారు. అయితే ఈ సినిమాలో కూడా కమల్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారా? హీరోయిన్ ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు.   పాలిటిక్స్ లో అడుగుపెడుతున్న కమల్‌కు ఇదే చివరి సినిమా కావొచ్చని సినీ వర్గాల అభిప్రాయం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1996 లో దేశవ్యాప్తంగా రిలీజై ఘన విజయం సాధించిన భారతీయుడు సినిమా భారతీయ చలచిత్ర రంగంలో ఒక మైలురాయి.  ఈ చిత్రం అప్పట్లో ఆస్కార్‌ అవార్డుకు నామినేట్ అయ్యింది. "భారతీయుడు" సినిమాలో హీరోగా నటించిన కమల్‌హాసన్‌.. 1997లో ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. అవినీతి, లంచం కథనంతో శంకర్ తెరకెక్కించిన భారతీయుడు చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు, అవార్డులు, రివార్డులు సాధించింది. దర్శకుడు శంకర్ కు, కమల్ హాసన్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించి పెట్టింది. అదేస్థాయిలో 'భారతీయుడు2' సినిమాలో కూడా అవినీతిపరులను పరుగులు పెట్టించబోతున్నాడు కమల్.