Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్! తనకు అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ బిరుదును పవన్ కల్యాణ్ త్యాగం చేశారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన 'భీమ్లా నాయక్' చిత్రంలో ఆయన ఇంట్రడక్షన్ షాట్ లో పేరుకు ముందు ఉండే 'పవర్ స్టార్' బిరుదు లేకుండా స్క్రీన్ పై కనిపించారు. దీనిపై పలువురు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడి పేరు ముందు పవర్ స్టార్ అనే బిరుదు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇకపై పవన్ నటించే సినిమాలన్నింటిలోనూ పవన్ కల్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ అనే బిరుదును తీసేస్తున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే ఓ రాజకీయ సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. తన అభిమానులు ఇకపై తనను పవర్ స్టార్ అని సంబోధించవచవద్దని ఆయన కోరిన విషయం తెలిసిందే. తనను పవన్ కల్యాణ్ అని పిలిస్తే చాలని అప్పుడు ఆయన అన్నారు. ఇప్పడదే మాటను 'భీమ్లా నాయక్' సినిమాలో అప్లే చేశారు. ఇప్పుడు వెండితెరపై తమ అభిమాన నటుడి పేరుకు ముందు పవర్ స్టార్ లేకపోవడం చూసి పవన్ కల్యాణ్ అభిమానులు షాక్ కు గురయ్యారు. 


పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ తెలుగు రీమేక్ ఈ సినిమా రూపొందింది. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నిత్యా మేనన్, రానా దగ్గుబాటితో సంయుక్త మేనన్ నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహించారు.    


Also Read: Bheemla Nayak Review: 'భీమ్లా నాయక్' మూవీపై టాలీవుడ్ ప్రముఖుల రివ్యూ!


ALso Read: Bheemla Nayak OTT: థియేటర్లలో భీమ్లానాయక్ సందడి.. ఓటీటీలో ఎప్పుడంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook